బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా రీ ఎంట్రీ తర్వాత ఇప్పటికీ టాప్ స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని హిట్స్ ని కొట్టగలను అని నిరూపించుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) రెండేళ్ళ క్రితం వాల్తేరు వీరయ్యతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నా తర్వాత చేసిన రీమేక్ భోలాశంకర్ సినిమా అట్టర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది..
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సంక్రాంతికి బింబిసార డైరెక్టర్ వశిష్టతో కలిసి చేస్తున్న విశ్వంభర(Vishwambara) తో రచ్చ లేపాల్సింది కానీ గేమ్ చేంజర్ కోసం రిలీజ్ ను త్యాగం చేసిన మెగాస్టార్ సమ్మర్ టైం కి లేదా సెకెండ్ ఆఫ్ లో ఈ సినిమాతో సందడి చేయబోతూ ఉండగా ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా..
ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫాం చేయగా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం చేశారు రీసెంట్…టాలీవుడ్ లో ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత ఆ రేంజ్ లో ఒక్క ఫ్లాఫ్ లేకుండా వరుస విజయాలతో దూసుకు పోతున్న డైరెక్టర్ గా పేరున్న అనిల్ రావిపూడి డైరెక్షన్ లో…
మెగాస్టార్ అప్ కమింగ్ మూవీ ఉండబోతూ ఉండగా, కంప్లీట్ గా మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని, ఈ సమ్మర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది అని ఆల్ మోస్ట్ కన్ఫాం చేశారు మెగాస్టార్…ఇక ఈ సినిమా ను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ఆల్ మోస్ట్ చెప్పగా….
కాంబో మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయాయి అని చెప్పాలి…ఈ సినిమా తో పాటు మెగాస్టార్ దసరా ఫేమ్ ఓడెల శ్రీకాంత్ తో ఓ రగ్గుడ్ మాస్ మూవీ కూడా చేయబోతూ ఉండగా, ఇక మీద వరుస సినిమాలతో మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తుంది…
అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఓ లెవల్ లో బ్రాండ్ ఏర్పడింది ఇప్పుడు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 270 కోట్ల గ్రాస్ తో ఊచకోత కోసిన అనిల్ రావిపూడి ఇక మెగాస్టార్ తో చేయబోయే సినిమాతో వచ్చే సంక్రాంతికి ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తాడో చూడాలి ఇప్పుడు.