బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి టాలీవుడ్ బిగ్ మూవీస్ వాల్తేరు వీరయ్య మరియు వీర సింహా రెడ్డి సినిమాలు రెండూ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా నైజాంలో ఈ రెండు సినిమాలకు టికెట్ హైక్స్ ఇచ్చేశారు, కానీ ఆంధ్రలో రిలీజ్ కి ముందు రోజు వరకు ఎలాంటి అప్ డేట్ రాక పోవడంతో బుకింగ్స్ ఓపెన్ చేయలేదు, కానీ ఎట్టకేలకు ప్రభుత్వం నుండి రెండు సినిమాలకు ఇప్పుడు టికెట్ హైక్స్ ని…
ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు, కాగా బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాకి 20 టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇవ్వగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కి 25 టికెట్ రేటు పెంచుకునే అవకాశం కల్పించారు…. కాగా రెండు సినిమాలకు కూడా టికెట్ హైక్ మీద GST కలిపి రేటు పెంచుకోవచ్చు…
ఈ టికెట్ హైక్స్ టోటల్ గా 10 రోజుల పాటు కొనసాగాబోతుంది, ఒక సినిమాకి ఎక్కువ ఒక సినిమా కి కొంచం తక్కువ ఉండటానికి కారణం వాల్తేరు వీరయ్యకి కొంచం బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో టికెట్ హైక్స్ మరో 5 ఎక్కువగా పెట్టారు… మొత్తం మీద ఇప్పుడు 2 సినిమాలకు…
10 రోజుల పాటు టికెట్ హైక్స్ రెండు రాష్ట్రాలలో ఉండటంతో ఈ అడ్వాంటేజ్ తో ఈ రెండు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయి అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి. టాక్ బాగుంటే రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి.