టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్ తో కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ ఆచార్య ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోలేక పోయింది. టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం….
బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ముందు నిలిచే రేంజ్ లో మైండ్ బ్లాంక్ చేసింది ఈ సినిమా… 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో కేవలం 48.36 కోట్ల షేర్ ని మాత్రమె వసూల్ చేసింది… దాంతో బ్రేక్ ఈవెన్ కి ఏకంగా….
84.14 కోట్ల దూరంలో ఆగిపోయి ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. అలాంటి రిజల్ట్ ని అస్సలు ఊహించని బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా నష్టాలను పూడ్చాలి అంటూ మేకర్స్ కి డిమాండ్ చేయగా మేకర్స్ కూడా అందుకు ఒప్పుకున్నారు….
కానీ సినిమా బిజినెస్ లెక్కలు అన్నీ కొరటాల చూసుకోవడంతో బయ్యర్లు ఆయన దగ్గరికే వెళ్ళగా ఓవరాల్ గా 20 కోట్ల వరకు వెనక్కి ఇవ్వడానికి టీం ఒప్పుకుందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది. కాగా ఈ మొత్తంలో ఆల్ రెడీ ఒకరిద్దరికీ…
ఆయా ఏరియాల నష్టాలలో కొద్ది వరకు ముట్టింది అని సమాచారం. అందులో కొందరికి ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ ఏరియాల రైట్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది…… మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న ఆచార్య సినిమా ఇలా చారిత్రిక డిసాస్టర్ గా నిలవడం, ఇప్పుడు ఇలా నష్టాలను పూడ్చాల్సి రావడం విచారకరం అనే చెప్పాలి. గాడ్ ఫాదర్ భారీ విజయంతో అందరిలీ లాభాలను తేవాలని కోరుకుందాం…