2 డేస్…13 కోట్లు!!

0
583

     మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజే అంచనాలను మించి వసూళ్ళ ని సాధించి సత్తా చాటుకుంది, ఓవరాల్ గా 4.2 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సత్తా చాటుకున్న ఈ సినిమా రెండో రోజు కూడా అన్ని మేజర్ ఏరియాల్లో స్టడీ గా కలెక్షన్స్ ని సాధించి అద్బుతంగా హోల్డ్ చేసింది.

నైజాం సీడెడ్ అలాగే వైజాగ్ ఏరియాల్లో సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న సినిమా మిగిలిన ఏరియాల్లో కొద్దిగా స్లో అయింది, అయినా కానీ రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్నట్లు సమాచారం.

ఇక వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా 2.8 కోట్ల దాకా షేర్ ని అందుకుందట సినిమా, ఏరియాల వారి లెక్కలు తేలాల్సి ఉండగా మొదటి రోజు అలాగే రెండో రోజు గ్రాస్ మొత్తం మీద 13 కోట్ల రేంజ్ లో ఉంటుందని సమాచారం, రీసెంట్ టైం లో సాయి ధరం తేజ్ కెరీర్ లో ఇది…

ది బెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్పుకోవాలి, సినిమా మొత్తం మీద ఇప్పుడు ఆదివారం కూడా జోరు చూపితే అద్బుతంగా హోల్డ్ చేసి వీకెండ్ ని ఘనంగా ముగించే అవకాశం ఉంది, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా తక్కువే అవ్వడం తో వర్కింగ్ డేస్ లో హోల్డ్ ని బట్టి లాంగ్ రన్ లో…

ఎంత దూరం వెళుతుందో అని అంచనా వేయవచ్చు, ఇక మొత్తం మీద 2 రోజుల ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉన్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here