లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో ఏడాదిలో 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన నాచురల్ స్టార్ నాని(Nani) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) తో ఆగస్టు 29న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉండగా….
దసరా(Dasara Movie) లాంటి ఊరమాస్ మూవీ తర్వాత, హాయ్ నాన్న(Hi Nanna Movie) లాంటి అల్ట్రా క్లాస్ మూవీ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం లాంటి పక్కా కమర్షియల్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా ప్రస్తుతం ఎలక్షన్స్ ఫీవర్ వలన అన్ని సినిమాల షూటింగ్ లు ఆగిపోగా…
ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడంతో అన్ని సినిమాల షూటింగ్ లు తిరిగి జోరు అందుకుంటూ ఉన్నాయి…కాగా ఎలక్షన్స్ తర్వాత రోజు మంగళవారం శనివారం సినిమా క్లైమాక్స్ ఫైట్ ను మొదలు పెట్టారట. భారీ సెట్టింగ్ లో సినిమా క్లైమాక్స్ ఫైట్ లావిష్ గా రూపొందిస్తున్నారట…
ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండగా కచ్చితంగా టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ ఓపెనింగ్స్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని అందరూ నమ్మకంగా ఉన్నారు… బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న నాచురల్ స్టార్ నాని ఈ సినిమా హాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇక…