రీసెంట్ టైం లో ఆడియన్స్ మనసును గెలుచుకున్న హార్ట్ టచింగ్ మూవీ కలర్ ఫోటో, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే భారీ సక్సెస్ ను సొంతం చేసుకుని ఉండేది కానీ డైరెక్ట్ రిలీజ్ వలన సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది అన్నది క్లియర్ అయినా కానీ ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకున్నది అన్నది మాత్రం అందరికీ అయితే తెలియ లేదు అనే చెప్పాలి.
ఆహా వీడియో లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆహా వీడియో వాళ్ళ 1 నెల సబ్ స్క్రిప్షన్ రేటు 50 ని టికెట్ రేటు గా భావించి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధించి ఉండవచ్చు అనేది అంచనా వేస్తె…. సినిమా సాధించిన వ్యూస్ లెక్కలు…
మొదటి 10 రోజులకు గాను రిలీజ్ అయిన విషయం తెలిసిందే, మొదటి రోజు 2 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ ని, వీకెండ్ కి వచ్చే సరికి 3 లక్షల 45 వేల వ్యూస్ ని ,5 రోజులు పూర్తీ అయ్యే సరికి… మొదటి వారం పూర్తీ అయ్యే సమయానికి…. 6 లక్షల 10 వేల దాకా వ్యూస్ ని సొంతంచేసుకుంది.
ఇక 10 రోజులకు గాను సినిమా 7 లక్షల మార్క్ ని అందుకుంది అంటున్న ఈ సినిమా మిగిలిన 4 రోజుల వర్కింగ్ డేస్ లో కూడా వ్యూస్ ప్రభావం కొనసాగగా మరో 40 వేల దాకా వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకోగా మొత్తం మీద 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి మొత్తం మీద ఈ సినిమా….
7 లక్షల 40 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారం… ఇక 50 టికెట్ రేటు తో 7 లక్షల 40 వేల వ్యూస్ కి 3.7 కోట్ల దాకా రెవెన్యూ వచ్చి ఉండ వచ్చని అంచనా వేయవచ్చు. సినిమాను 3 కోట్లు పెట్టి కొన్న ఆహా వీడియో వాళ్లకి ఇప్పటికే 70 లక్షల ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు… టికెట్ రేటు ఎక్కువ అనుకుంటే ఈ లెక్క మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.