చిన్న సినిమానే అయినా కానీ ఫీల్ గుడ్ మూవీ గా ఆడియన్స్ మనసును గెలుచుకుని దూసుకు పోతున్న సినిమా కలర్ ఫోటో, రీసెంట్ గా ఆహా వీడియో లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కి మొదటి రోజు ఆల్ మోస్ట్ అన్ని సైట్స్ నుండు కూడా నెగటివ్ రివ్యూలే దక్కాయి. రొటీన్ కథ అని, క్లైమాక్స్ కూడా రొటీన్ గా ఉందని, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి…
చాలా టైం పట్టింది అంటూ నెగటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నా కానీ కామన్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెప్పించిన ఈ సినిమా ఆహా వీడియో లో సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతూ దుమ్ము లేపుతుంది. సినిమా కి ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి రోజు….
2 లక్షల 15 వేల దాకా యూనిక్ వ్యూస్ దక్కగా వీకెండ్ పూర్తీ అయ్యే సరికి 3 లక్షలా 45 వేల దాకా యూనిక్ వ్యూస్ ని ఈ సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేయగా ఇప్పుడు 5 రోజులకు గాను సినిమా సాధించిన వ్యూస్ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కల ప్రకారం సినిమా…
మొత్తం మీద 5 రోజులు పూర్తీ అయ్యే సరికి 5 లక్షలా 15 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు, హాఫ్ మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకు పోతున్న సినిమా ఎంత వరకు కలెక్షన్స్ అందుకుని ఉండొచ్చని అంచనా వేస్తె… ఆహా యాప్ ఒక నెల రేటు 50 అనుకుని అదే టికెట్ రేటు అనుకుంటే…
5 లక్షల 15 వేల వ్యూస్ కి 2.57 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సాధించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు. అంటే సినిమా పై పెట్టిన 3 కోట్ల రేటు ఇప్పుడు మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ తిరిగి వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెబుతుండటం విశేషం అనే చెప్పాలి.
Colour photo movie block buster anthe