Home న్యూస్ కలర్ ఫోటో రివ్యూ…..ప్లస్ & మైనస్ పాయింట్స్!!

కలర్ ఫోటో రివ్యూ…..ప్లస్ & మైనస్ పాయింట్స్!!

0

సుహాస్ చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కలర్ ఫోటో, రీసెంట్ టైం లో చిన్న పెద్ద అని తేడా లేకుండా రిలీజ్ అయిన టీసర్లలో మంచి ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా ఈ సినిమా, డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా ఆహా వీడియో లో రిలీజ్ అయింది, మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే… మచిలీపట్నం దగ్గరలో ఉండే ఓ చిన్న ఊరిలి 1997 టైం లో జరిగిన కథ ఈ సినిమా, తనకంటే అందంగా ఉండే హీరోయిన్ తన కలర్ కి పడదని దూరంగా నే చూస్తూ లవ్ చేసే హీరో మంచితనాన్ని మెచ్చి హీరోయిన్ లవ్ చేస్తుంది.

దాంతో అస్సలు అంచనా కూడా లేని విజయం దక్కడంతో హీరో ఆనందానికి అవధులు లేకుండా పోతుంది, ఇంత లో విలన్ గా హీరోయిన్ అన్నయ్య సునీల్ ఎంటర్ అవుతాడు, ఒక్కసారిగా పరిస్థితులు మారి పోతాయి, అసలు హీరో హీరోయిన్ ఏకం అయ్యారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుహాస్ తన రోల్ లో జీవించేశాడు, తనకోసమే ఈ పాత్ర పుట్టిందా అన్నట్లు ఈ రోల్ లో అద్బుతంగా నటించాడు, కొన్ని సీన్స్ లో ఏడిపించే లెవల్ లో నటించి జీవించాడు సుహాస్, ఇక చాందిని చౌదరీ కూడా అద్బుతంగా నటించి మెప్పించాగా… తన డబ్బింగ్ ఒక్కటి కొంచం అక్కడక్కడా ఇబ్బంది పెట్టింది…

ఇక సునీల్ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తీ విరుద్దమైన పాత్ర చేసినా కానీ తన విలనిజం తో బాగా మెప్పించాడు అని చెప్పాలి, ఇక వైవా హర్షా తన కామెడీ తో అక్కడక్కడా మేరిపించాగా మిగిలిన రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నంతతో తమ రోల్స్ తో ఆకట్టుకున్నారు.

సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి వెన్నెముక అని చెప్పాలి, ఫీల్ గుడ్ మ్యూజిక్, సోల్ ఫుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఆకట్టుకోగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నీరసంగా సాగుతుంది, కథ మెయిన్ పాయింట్ కి రావడానికి చాలా టైం తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ అప్పటి పరిస్థితులను బాగా చూపెట్టారు.

ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉండగా సందీప్ రాజ్ డైరెక్షన్ లో చెప్పాలి అనుకున్న పాయింట్ ని బాగానే చెప్పినా కొన్ని చోట్ల తడబడ్డాడు, హీరో కలర్ పై ఒక స్టేజ్ లో లెక్చర్లు ఇస్తాడు కానీ అదే హీరో తన కలర్ కి హీరోయిన్ పడదని క్రీములు లాంటివి రాసుకుంటాడు…. కథ ఫస్టాఫ్ లో అనవసరపు అన్నివేశాలు ఎక్కువగా వచ్చినప్పటికీ వాటితో…

ఎంటర్ టైన్ చేయడంతో పెద్దగా బోర్ కొట్టలేదు, చాలా సింపుల్ కథని ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా తర్వాత సీన్ ముందే ప్రిడిక్ట్ చేసేలా రాసుకున్నాడు డైరెక్టర్… ఇది తప్పితే సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమి లేవనే చెప్పాలి. కొంచం ఓపిక చేసుకుని సినిమా చూడాల్సి ఉంటుంది.

అలా చూస్తె మొత్తం మీద సినిమా మెప్పిస్తుంది, రేసీ స్క్రీన్ ప్లే ఎక్స్ పెర్ట్ చేసి చూస్తే కొంచం బోర్ కొడుతుంది… మొత్తం మీద సినిమా చాలా వరకు మెప్పించాగా కొన్ని పాయింట్స్ వైజ్ అంచనాలను తప్పింది, లెంత్ కొంచం తగ్గించి, స్క్రీన్ ప్లే కొంచం స్పీడ్ చేసి, క్లైమాక్స్ ని…

కొంచం బెటర్ గా డీల్ చేసి ఉంటే… సినిమా టీసర్ సృష్టించిన హైప్ ని మించి ఉండేది, కానీ ఉన్నంతలో సినిమా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే ఫీల్ గుడ్ మూవీనే అని చెప్పాలి, రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా కొంచం ఓపిక చేసుకుంటే సినిమా చాలా వరకు మెప్పిస్తుందని చెప్పొచ్చు. సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here