జైలర్ మూవీతో ఎపిక్ రికార్డులు సృష్టించిన కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) తర్వాత చేసిన వేట్టయన్ తో అంచనాలను అందుకోలేక పోయాడు, అయినా కూడా ఇప్పుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున(King Nagarjuna) స్పెషల్ రోల్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ(Coolie Movie) మీద అంచనాలు…
ఓ రేంజ్ లో ఉండగా ఆగస్టు లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా కోలివుడ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తుందని అందరూ నమ్ముతూ ఉండగా, సినిమా మీద క్రేజ్ ఏ లెవల్ లో ఉంది అని నిరూపించడానికి సినిమా బిజినెస్ ఆఫర్స్ ని చూస్తె అర్ధం అవుతుంది.
ఓవర్సీస్ మార్కెట్ రజినీకాంత్ కి ఎప్పటి నుండో సాలిడ్ ప్లస్ పాయింట్ కాగా ఇప్పుడు క్రేజీ కాంబో లో వస్తున్న కూలీ సినిమాకి ఓవర్సీస్ లో బిజినెస్ ఆఫర్స్ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో సొంతం అవుతూ ఉండగా ఆల్ మోస్ట్ ఇప్పుడు సినిమా ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయిందని అంటున్నారు…
ఆల్ మోస్ట్ సినిమాకి ఏకంగా 80 కోట్ల రేంజ్ లో మమ్మోత్ బిజినెస్ ఆఫర్ రాగా ఆ డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయిందని అంటున్నారు ఇప్పుడు…ఈ రేంజ్ రేటు అంటే సినిమా ఓవర్సీస్ లో అంచనాలను మించి వసూళ్ళ భీభత్సం సృష్టిస్తూ ఏకంగా 165-170 కోట్ల రేంజ్ లో..
గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండిపెండెంట్స్ వీకెండ్ లో వార్2 సినిమాతో పోటి పడి రిలీజ్ కాబోతున్నా కూడా సౌత్ వరకు అయితే హాట్ ఫేవరేట్ అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో అంచనాలను మించి దుమ్ము లేపుతుందో చూడాలి ఇప్పుడు…