Home న్యూస్ చిన్న సినిమా కోర్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఇన్ని కోట్లా!!

చిన్న సినిమా కోర్ట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు ఇన్ని కోట్లా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie), చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఈ వీకెండ్ లో ఓ రేంజ్ లో షేక్ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా…

పేరుకు చిన్న సినిమానే అయినా బడ్జెట్ ముందు అనుకున్న అమౌంట్ కన్నా కూడా పెరిగి మంచి క్వాలిటీతో రూపొందించడంతో ఏకంగా 10 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణం అవ్వగా సినిమా ప్రమోషన్స్ అండ్ ఇతర ఖర్చులు కలిపి ఓవరాల్ గా 11 కోట్ల రేంజ్ లో ఖర్చు అవ్వగా…

బిజినెస్ పరంగా కూడా రిలీజ్ కి ముందే నాని బ్రాండ్ వాల్యూ వలన ఎక్స్ లెంట్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకుని సాలిడ్ రికవరీని దక్కించు కోవడం విశేషం అని చెప్పాలి. సినిమా ఓవరాల్ గా శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ అండ్ మ్యూజిక్ రైట్స్ కలిపి…

ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ కింద 9.5 కోట్ల రేంజ్ లో రేటుని ఓవరాల్ గా రికవరీ చేసి సంచలనం సృష్టించింది…దాంతో 11 కోట్ల బడ్జెట్ లో 9.5 కోట్లు ఇక్కడే రికవరీ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర నుండి షేర్ పరంగా సినిమా…1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని..

మినిమమ్ అందుకున్నా మేకర్స్ కి ఇక లాభాలు మొదలు అని చెప్పాలి. కానీ ఓవరాల్ గా సినిమా థియేట్రికల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉంటుందని అంచనా… సినిమా డీసెంట్ బాక్స్ ఆఫీస్ హిట్ అనిపించుకోవాలి అంటే 7 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. వీకెండ్ లోనే ఈ మొత్తాన్ని సినిమా రికవరీ చేసే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here