Home న్యూస్ కోర్ట్ మూవీ ప్రీమియర్స్ కలెక్షన్స్….చిన్న సినిమా వీర లెవల్ కుమ్ముడు!!

కోర్ట్ మూవీ ప్రీమియర్స్ కలెక్షన్స్….చిన్న సినిమా వీర లెవల్ కుమ్ముడు!!

0

ఆడియన్స్ ముందుకు హోలీ వీకెండ్ లో చిన్న సినిమాగానే రిలీజ్ అయినా కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) ఎక్స్ లెంట్ రివ్యూలను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా రిలీజ్ కి ముందు రోజే ఇటు తెలుగు రాష్ట్రాల్లో…

అటు ఓవర్సీస్ లో భారీ ప్రీమియర్స్ తో ఓపెన్ అయిన సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది….తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ షోలతో మొదలైన సినిమాలు షోలు, ఆడియన్స్ నుండి వచ్చిన ఎక్స్ లెంట్ రెస్పాన్స్ తో అలా అలా పెరిగి ఏకంగా 100 కి పైగా…

స్పెషల్ షోలు పడగా ట్రాక్ చేసిన సెంటర్స్ నుండే గ్రాస్ ఏకంగా 55 లక్షలకు పైగా సొంతం చేసుకోగా…ఫైనల్ లెక్క 60-65 లక్షల దాకా ఉండే అవకాశం ఉండగా….ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా అక్కడ నుండి..

ఇప్పటి వరకు 150K డాలర్స్ మార్క్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది…..ఇండియన్ కరెన్సీ లో సినిమా 1.3 కోట్ల మార్క్ ని అందుకోగా టోటల్ ఓవర్సీస్ లెక్క 1.4 కోట్ల దాకా ఉండగా…ఓవరాల్ గా రిలీజ్ రోజు కన్నా ముందే ప్రీమియర్స్ ద్వారానే కోర్ట్ సినిమా…

వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ మాస్ రచ్చ చేసింది. ఇక ఫైనల్ ప్రీమియర్స్ నంబర్స్ రావాల్సి ఉండగా…ఇటు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు హోలీ హాలిడే అడ్వాంటేజ్ తో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here