బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) సినిమా ఈ ఇయర్ అన్ సీజన్ లో రిలీజ్ అవ్వగా ట్రైలర్ క్లిక్ అయినా పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తుంది అనుకున్నా సినిమాకి యునానిమస్ పాజిటివ్ రివ్యూలు ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా…
కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తర్వాత లాంగ్ రన్ లో కూడా వీర లెవల్ లో కుమ్మేసిన సినిమా 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని తెలుగు రాష్ట్రాల్లో మాస్ రచ్చ చేసింది. తర్వాత లాంగ్ రన్ లో ఊహకందని రేంజ్ లో…
ఎక్స్ లెంట్ లాభాలను సొంతం చేసుకున్న సినిమా చిన్న సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి 56.75 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా…
ఓవరాల్ గా సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
#CourtStateVsANobody Total WW Collections(Inc GST)
👉Nizam – 11.50CR~
👉Ceeded – 2.00CR~
👉Andhra – 8.55Cr~
AP-TG Total – 22.05CR(38.80CR~ Gross)
👉KA+ROI: 2.45Cr
👉OS- 5.10CR
Total World Wide Collections: 29.60CR(56.75CR~ Gross)
మొత్తం మీద సినిమా 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఏకంగా 22.6 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను అందుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్ గా నిర్మాతగా నాని కి తిరుగు లేని సక్సెస్ ను సొంతం అయ్యేలా చేసుకుంది సినిమా…