Home న్యూస్ కస్టడీ రివ్యూ-రేటింగ్…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

కస్టడీ రివ్యూ-రేటింగ్…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కృతి శెట్టి ల కాంబినేషన్ లో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కస్టడీ భారీ లెవల్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు. థాంక్ యు లాంటి ఫ్లాఫ్ తర్వాత వస్తున్న ఈ సినిమా తో ఎలాగైనా కంబ్యాక్ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఇప్పుడు ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే సిన్సియర్ కానిస్టేబుల్ అయిన హీరో తన స్టేషన్ కి వచ్చిన విలన్ ను కొందరి నుండి కాపాడాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి…. హీరో ఎలా ఈ ప్రాబ్లంను ఫేస్ చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… వెంకట్ ప్రభు మూవీస్ అంటే కథ పాయింట్ సింపుల్ గా ఉన్నా కూడా…

స్క్రీన్ ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ కచ్చితంగా మెప్పిస్తాయి… కానీ కస్టడీ మూవీ 1995 టైం నాటి కథ అవ్వడంతో లవ్ స్టొరీ కానీ, వెన్నెల కిషోర్ తో కామెడీ కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు… స్క్రీన్ ప్లే కూడా వెంకట్ ప్రభు ప్రీవియస్ మూవీస్ రేంజ్ లో అయితే లేవు…. సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి కూడా 20-25 నిమిషాల టైం తీసుకోగా…

అరవింద్ స్వామి ఎంట్రీతో సినిమా ట్రాక్ ఎక్కుతుంది. తర్వాత ఇంటర్వెల్ వరకు మాత్రం కథ బాగా సాగి సెకెండ్ ఆఫ్ పై అంచనాలను పెంచుతుంది. ఫస్టాఫ్ లో సాంగ్స్, లవ్ ట్రాక్ మైనస్ అవ్వగా ప్రీ ఇంటర్వెల్ సీన్ హైలెట్ గా నిలుస్తుంది… ఇక సెకెండ్ ఆఫ్ కూడా ఇదే రేంజ్ లో మెప్పిస్తే సినిమా హిట్ పక్కా అనుకుంటున్న టైంలో..

సెకెండ్ ఆఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా సాదాసీదాగా ఉండగా విలన్ బ్యాగ్రౌండ్ స్టోరీ కూడా పెద్దగా మెప్పించదు.. సెకెండ్ ఆఫ్ లోనే సీన్స్ చాలా వరకు స్లో నరేషన్ తో బోర్ ఫీల్ అయ్యేలా చేసినా అక్కడక్కడా వచ్చే కొన్ని కామియో ఎపిసోడ్ లు, ట్విస్ట్ లు ఎలాగోలా సినిమాను చూసేలా చేస్తాయి…. 

తన రోల్ వరకు నాగ చైతన్య మరోసారి మెప్పించగా, చాలా సీన్స్ లో అరవింద్ స్వామి హైలెట్ అయ్యారు, ఇక కృతి శెట్టి రోల్ పర్వాలేదు అనిపిస్తే… ప్రియమణి, శరత్ కుమార్ రోల్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. మిగిలిన యాక్టర్స్ రోల్స్ పరిది మేర పర్వాలేదు… సినిమా కి మేజర్ డ్రా బ్యాక్ సంగీతం… ఒక్క పాట కూడా మెప్పించ లేక పోయింది…

ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి బాగున్నా ఓవరాల్ గా జస్ట్ యావరేజ్ అనిపించింది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించగా, ప్రొడక్షన్ వాల్యూస్ ఎందుకనో అనుకున్న రేంజ్ లో లేవని చెప్పాలి. ఇక వెంకట్ ప్రభు డైరెక్షన్ విషయానికి వస్తే ఫస్టాఫ్ వరకు స్లో స్టార్ట్ నుండి మంచి ఫస్టాఫ్ ని ఇచ్చినా సెకెండ్ ఆఫ్ లో…

ఆ ఊపుని కంటిన్యూ అయితే చేయలేక పోయాడు డైరెక్టర్… కానీ సెకెండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్, క్యామియో సీన్స్, అలాగే ఒకటి రెండు ట్విస్ట్ లు మెప్పించడంతో స్లో నరేషన్ ఉన్నా కూడా ఓపికతో చూస్తె పర్వాలేదు అనిపించవచ్చు. మొత్తం మీద సినిమాలో సాంగ్స్ ని, కొన్ని బోర్ సీన్స్ ని తీసేసి 2 గంటల నిడివి రన్ టైంని పెట్టి ఉంటే చాలా బెటర్ గా ఉండేది సినిమా…

మొత్తం మీద సినిమాలో ఫ్లాస్ ఉన్నాయి, కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్టాఫ్ వరకు బాగున్నా సెకెండ్ ఆఫ్ బోర్ సీన్స్ ని బరించగలిగితే ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది కస్టడీ మూవీ… మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here