బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ దబంగ్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మంచి టాకే లభించింది, కానీ ఇండియా లో ముఖ్యంగా నార్త్ లో పరిస్థితులు అనుకూలంగా లేక పోవడం తో ఆ ఎఫెక్ట్ ఈ సినిమా పై పడింది.
సినిమా మొదటి రోజు 30 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంటుంది అనుకున్నా 24 కోట్ల కే సరి పెట్టగా రెండో రోజు కూడా 25 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ ని అందుకుంది, ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదివారం అవ్వడం తో ఎలాగోలా గ్రోత్ ని సాధించింది.
మొత్తం మీద సినిమా మూడో రోజు 29 కోట్ల నుండి 30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇండియా మొత్తం సాధించినట్లు సమాచారం. ఈ కలెక్షన్స్ సౌత్ డబ్బింగ్ వర్షన్స్ తో కలిపి వచ్చిన కలెక్షన్స్ అని తెలుస్తుంది. ఇక సినిమా తెలుగు వర్షన్ ని చూస్తె…
మొదటి రోజు 20 లక్షల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా రెండో రోజు 18 లక్షల షేర్ ని అందుకుంది, మళ్ళీ మూడో రోజు 21 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసిందట. దాంతో మూడు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ 59 లక్షల షేర్ గా చెబుతున్నారు.
తెలుగు లో సినిమా తెలుగు అండ్ హిందీ వర్షన్స్ కలిపి 2.2 కోట్ల రేంజ్ బిజినెస్ చేసింది, హిట్ అవ్వాలి అంటే 2.5 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. కానీ పోటి వలన సినిమా కి మరీ అనుకున్న రేంజ్ కలెక్షన్స్ అయితే దక్కలేదు అనే చెప్పాలి. మరి రానున్న టైం లో సినిమా జోరు చూపుతుందేమో చూడాలి.