బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా మంచి రివ్యూలను సొంతం చేసుకున్నా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా…
నెక్స్ట్ లెవల్ లో రాంపెజ్ ను చూపించడంతో అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది కానీ లాంగ్ రన్ లో బాలయ్య కెరీర్ లో అయితే ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని అయితే సొంతం చేసుకుని దుమ్ము లేపింది, కానీ కంప్లీట్ బ్రేక్ ఈవెన్ ని మాత్రం సొంతం చేసుకోలేక పోయింది.
కానీ తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయినప్పుడు సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సోషల్ మీడియా మొత్తం షేక్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ సినిమాలో బాలయ్య ఎలివేషన్ లు, తమన్ కొట్టిన రిమార్కబుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ సీన్స్ చక్కర్లు కొడుతూనే ఉండటం విశేషం కాగా…
మరో పక్క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకోగా రీసెంట్ గా 100 రోజులను కూడా కంప్లీట్ చేసుకోవడం విశేషం అని చెప్పాలి. చిలకలూరిపేటలోని వెంకటేశ్వర థియేటర్ లో సినిమా 100 రోజులను రోజూ 4 షోలు ప్రదర్శిస్తూ కంప్లీట్ చేసుకుంది..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా 1 థియేటర్ లో 100 రోజులను కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు డాకు మహారాజ్ కూడా 100 రోజులను అందుకోగా ఓవరాల్ బాక్ టు బాక్ 100 రోజుల సినిమాలతో బాలయ్య ఊరమాస్ రచ్చ చేశాడు.
అఖండ, వీర సింహా రెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలు కూడా 100 రోజులతో రచ్చ లేపగా…ఇప్పుడు నాలుగో వరుస 100 రోజుల సినిమాతో కెరీర్ లోనే పీక్ ఫామ్ తో రచ్చ లేపాడు..ఇక అఖండ2 తో బాలయ్య ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.