బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస హిట్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన డాకు మహారాజ్(Daaku Maharaj Movie) ఈ ఇయర్ ఫస్టాఫ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ లో ఒకటి అని చెప్పాలి. సంక్రాంతికి కాకుండా నార్మల్ టైం లో రిలీజ్ అయ్యి ఉంటే…
కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి వసూళ్ళని సొంతం చేసుకుని ఉండేది… అయినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 136 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేయగా…
తర్వాత డిజిటల్ లో సాలిడ్ సక్సెస్ గా నిలిచిన ఈ సినిమా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఎలివేశన్స్ పరంగా ట్రెండ్ అవుతూనే ఉండగా మరో పక్క ఒక థియేటర్ లో సినిమా 175 డేస్ ని కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసింది.
ఆంధ్రలో చిలకలూరిపేట లో వెంకటేశ్వర థియేటర్ లో సినిమా రోజుకి 4 షోల తో రన్ అవుతూ ఏకంగా 175 రోజులను రీసెంట్ గా అక్కడ కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు. దాంతో బాలయ్య వరుసగా నాలుగో సారి 175 డేస్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకుని మాస్ రచ్చ చేశాడు…
ఇది వరకు అఖండ, వీర సింహా రెడ్డి మరియు భగవంత్ కేసరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవ్వడమే కాదు, ఏకంగా 175 రోజుల పాటు రన్ అయ్యి మాస్ రచ్చ చేయగా ఇప్పుడు నాలుగో సారి డాకు మహారాజ్ సినిమా కూడా ఇప్పుడు డైలీ నాలుగు షోలు పూర్తి చేసుకుని…
175 రోజులను పూర్తి చేసుకుంది. దాంతో రీసెంట్ టైంలో టాలీవుడ్ లో ఏ హీరో కూడా సాధించని రేంజ్ లో ఇలా 175 డేస్ రికార్డ్ ను సొంతం చేసుకుని బాలయ్య సంచలనం సృష్టించడం విశేషం. ఇక ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో అఖండ2 తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక…