Home న్యూస్ థియేటర్స్ షేక్….సమరసింహారెడ్డిని మించిపోతుంది…కాచుకోండి ఇక!!

థియేటర్స్ షేక్….సమరసింహారెడ్డిని మించిపోతుంది…కాచుకోండి ఇక!!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలను పూర్తి చేసుకున్న తర్వాత డబుల్ హాట్రిక్ కి సిద్ధం అవుతూ చేస్తున్న లేటెస్ట్ మూవీ అయిన డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా మంచి అంచనాల నడుమ సంక్రాంతికి సందడి చేయడానికి సిద్ధం అవుతుంది.

సినిమా మీద మంచి అంచనాలు ఉన్నప్పటికీ ఆడియో అయితే అనుకున్న రేంజ్ లో కిక్ ఇవ్వలేదు…కానీ డైరెక్టర్ బాబీ ఫామ్ లో ఉండటం ఇటు బాలయ్య హాట్రిక్ హిట్స్ తో మరింత జోరు మీద ఉండటంతో సినిమా మట్టుకు అంచనాలను మించి పోతుంది అని అందరూ ఆశిస్తున్నారు…

ఇక సినిమా గురించి హైప్ ను మరో లెవల్ కి తీసుకు వెళుతూ లేటెస్ట్ గా సినిమా నిర్మాత నాగవంశీ సినిమా లో బిగ్గెస్ట్ హైలెట్ సీన్ గురించి చెబుతూ థియేటర్స్ దద్దరిల్లిపోతాయి అంటూ ఓ రేంజ్ లో హైప్ ఇచ్చేశాడు…బాలయ్య నటించిన సమరసింహారెడ్డి సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది..

అప్పట్లో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన ఈ సినిమా ఓ ప్రభంజనం సృష్టించింది….సినిమాలో సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్…కత్తి తో నరికే సన్నివేశాలు అప్పట్లో ఓ ఊపు ఊపేశాయి… ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా విషయంలో కూడా ఇదే జరగబోతుంది అని అంటున్నారు…

నిర్మాత మాట్లాడుతూ సెకెండ్ ఆఫ్ లో వచ్చే ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ అందరికీ థియేటర్స్ లో పూనకాలు తెప్పిస్తుంది అని చెబుతూ కచ్చితంగా బాలయ్య కెరీర్ లో బెస్ట్ అనిపించే సమరసింహారెడ్డి సినిమాలో యాక్షన్ సీన్ ను కూడా మరిపించే రేంజ్ లో…

డాకు మహారాజ్ సెకెండ్ ఆఫ్ లో యాక్షన్ సీన్ అదిరిపోయే రేంజ్ లో ఔట్ పుట్ వచ్చింది అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు…దాంతో ఒక్క సారిగా సినిమా మీద హైప్ పెరిగిపోగా ఇదే కనుక నిజం అయ్యి సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినా ఇక బాలయ్య కెరీర్ లో మరిన్ని రికార్డులు ఈ సినిమా నమోదు చేయడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here