బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో హాట్రిక్ ను కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేసిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) భారీ అంచనాల నడుమ 12న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రిలీజ్ కి ముందు సినిమా నుండి…
మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు…మొదటి ట్రైలర్ బాలయ్య రీసెంట్ మూవీస్ తో పోల్చితే పెద్దగా పవర్ ఫుల్ డైలాగ్స్ ఏమి లేకుండా డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వగా…ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ 2 మాత్రం బాగా మాస్ డైలాగ్స్ తో అరాచకం అనిపించింది…
తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో ఓ రేంజ్ లో హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి….బాడీలో అనేక కత్తిపోట్లు బులెట్ దిగినా అంతమందిని చంపాడంటే వాడు మనిషి కాదు వైల్డ్ యానిమల్….రాయాల సీమ మాలుం తెరకూ…వో మేరా అడ్డా….
ఎవరన్నా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో…నేను చంపడంలో చేశా…అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ అండ్ తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఒక్కసారి గా సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయాయి అని చెప్పాలి ఇప్పుడు. సినిమా కూడా ఇదే రేంజ్ లో మెప్పిస్తే కనుక…
మరో సాలిడ్ హిట్ బాలయ్య ఖాతాలో పడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇలా కాంబినేషన్ మొత్తం హిట్స్ తో జోరు మీద ఉండటంతో మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.