Home న్యూస్ డాకు మహారాజ్ సీడెడ్ డే 1 కలెక్షన్స్….బాలయ్య కెరీర్ బెస్ట్ తాండవం!!

డాకు మహారాజ్ సీడెడ్ డే 1 కలెక్షన్స్….బాలయ్య కెరీర్ బెస్ట్ తాండవం!!

0

బాక్ టు బాక్ హాట్రిక్ విజయాలతో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా కూడా కుమ్మేసిన సినిమా….

తొలిరోజు అంచనాలను మించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు….అన్ని ఏరియాల్లో ఎలా ఉన్నా రాయలసీమ ఏరియాలో మాత్రం బాలయ్య కెరీర్ లో ది బెస్ట్ అనిపించే రేంజ్ లో జోరు చూపించి కుమ్మేసింది సినిమా….

రిలీజ్ కి ముందు ఉన్న హైప్ పరంగా బాలయ్య రీసెంట్ మూవీస్ లో వీర సింహా రెడ్డి మాసివ్ క్రేజ్ తో రిలీజ్ అయ్యి అన్ని ఏరియాల్లో కుమ్మేసింది…ఆ సినిమా రేంజ్ హైప్ లేక పోయినా కూడా టాక్ బాగుండటంతో జోరు చూపించడం మొదలు పెట్టిన సినిమా షో షోకి గ్రోత్ ని చూపిస్తూ…

డే ఎండ్ అయ్యే టైంకి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని రాయలసీమ లో మొదటి రోజున సొంతం చేసుకుంది…వీర సింహా రెడ్డి 6.55 కోట్ల షేర్ ని అందుకోగా 1.51 కోట్ల హైర్స్ మొదటి రోజు యాడ్ అవ్వగా వర్త్ షేర్ 5 కోట్లకు పైగా ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన డాకు మహారాజ్ మూవీ మొదటి రోజు…

హైర్స్ లాంటివి ఏమి యాడ్ అవ్వలేదు అని చెబుతూ ఉండగా షేర్ పరంగా 5.25 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…ఈ రెండు సినిమాల కన్నా ముందు చేసిన భగవంత్ కేసరి మూవీ 2.74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా అంతకన్నా ముందు చేసిన అఖండ మూవీ..

మొదటి రోజు 4.02 కోట్ల షేర్ ని అందుకోగా అందులో 72 లక్షల హైర్స్ యాడ్ అయ్యాయి. ఓవరాల్ గా రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో అంచనాలను మించి పోయిన డాకు మహారాజ్ ఇప్పుడు అసలు సిసలు సంక్రాంతి వీక్ లో ఏ రేంజ్ లో కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here