బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 టైంలో కెరీర్ లోనే లోవేస్ట్ ఫేజ్ లో ఉన్నప్పటికీ కూడా తర్వాత అల్టిమేట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని బాక్ టు బాక్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సీనియర్ హీరోల్లో సాలిడ్ ఫామ్ తో దూసుకు పోతున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా..
ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భారీ లెవల్ లో సంక్రాంతికి రిలీజ్ కానుండగా సినిమా మీద మంచి అంచనాలు ఉండగా ట్రేడ్ లో కూడా సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది…ఓపెనింగ్స్ కచ్చితంగా సినిమా కుమ్మేస్తుంది అని అందరూ ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా…
బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ తో పోల్చితే జనవరి 12న డాకు మహారాజ్ సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది…. ఒకసారి బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ ను గమనిస్తే…
#Balakrishna Recent Movies 1st Day Shares(AP-TG)
👉#BhagavanthKesari – 14.36CR
👉#VeeraSimhaReddy – 25.35CR
👉#Akhanda – 15.39Cr
👉#Ruler – 4.25Cr
👉#NTRMahaNayakudu – 2.12Cr
👉#NTRKathaNayakudu – 7.6Cr
అల్టిమేట్ డిసాస్టర్ మూవీస్ తర్వాత బాలయ్య సెన్సేషనల్ కంబ్యాక్ తో దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండగా…
బాలయ్య ప్రీవియస్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు రికార్డు ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. కానీ ఈ సారి సంక్రాంతికి సెకెండ్ రిలీజ్ గా రాబోతున్న డాకు మహారాజ్ మూవీ కి సరిపడా థియేటర్స్ ఉంటాయి కాబట్టి టాక్ అండ్ బజ్ ను బట్టి చూస్తూ ఉంటే…
18-20 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటే కనుక బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకుంది అని చెప్పొచ్చు…. అంతకుమించి వస్తే మట్టుకు బాలయ్య మాస్ ఊచకోత అని చెప్పాలి…. మరి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఎలాంటి రచ్చ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.