బాక్స్ ఆఫీస్ దగ్గర హాట్రిక్ విజయాలతో దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో…
టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. ఇక సినిమా డే ఎండ్ అయ్యే టైంకి ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా…ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే బాలయ్య సటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సారి మెప్పించగా…
చిన్న పాపతో బాలయ్య సన్నివేశాలు అన్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయని అంటున్నారు…ఇక సెకెండ్ ఆఫ్ లో వచ్చే నీళ్ళ కోసం జనాలు పడే కష్టాలు అలాగే సెంటి మెంట్ సీన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయని చెబుతూ ఉండగా….ఓవరాల్ గా బాలయ్య నుండి మరో భగవంత్ కేసరి లాంటి మూవీలా…
డాకు మహారాజ్ సినిమా అనిపించింది అంటున్నారు…ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రిపోర్ట్స్ వినిపిస్తూ ఉండగా, కామన్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా స్టోరీ పాయింట్ చాలా వరకు ప్రిడిక్ట్ చేసేలా ఉన్నప్పటికీ కూడా…
బాలయ్య ఎలివేషన్ సీన్స్ కానీ అలాగే తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ రోటిన్ సీన్స్ ను కూడా చివరి వరకు కూర్చుని చూసేలా చేశాయని అంటున్నారు….కానీ ఫస్టాఫ్ లో ఉన్న మాస్ ఎలిమెంట్స్ సెకెండ్ ఆఫ్ లో సెంటి మెంట్ సీన్స్ వలన కొంచం తగ్గినా కొన్ని ఎలివేషన్ సీన్స్ బాగుండటంతో క్లైమాక్స్ రొటీన్ గానే అనిపించినా…
ఓవరాల్ గా ఎలివేషన్స్ కోసం బాలయ్య హీరోయిజం కోసం ఒకసారి ఈజీగా చూసేలా సినిమా ఉందని అంటున్నారు…మొత్తం మీద రెగ్యులర్ మూవీ లవర్స్ నుండి కూడా సినిమాకి ఎబో యావరేజ్ రేంజ్ లో రిపోర్ట్ లు వినిపిస్తూ ఉండగా…మొత్తం మీద డే అంతా కూడా…
ప్రీమియర్స్ నుండి రోజు ముగిసే సరికి సినిమా కి ఎబో యావరేజ్ రేంజ్ రిపోర్ట్ లు అలాగే క్యారీ అవ్వడం, ఆఫ్ లైన్ లో కూడా టాక్ బాగానే స్ప్రెడ్ అయింది అని చెప్పొచ్చు…దాంతో సంక్రాంతి కి బాలయ్య మరోసారి మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది ఈ టాక్ తో…ఇక కలెక్షన్స్ పరంగా సినిమా ఏ రేంజ్ లో కుమ్మేస్తుందో చూడాలి.