బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత కొంచం స్లో డౌన్ అయినా కూడా ఉన్నంతలో మంచి జోరునే చూపెడుతూ వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా…..
80 కోట్ల షేర్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండగా మరో పక్క సినిమా రీసెంట్ గా తమిళ్ లో డబ్ అయ్యి లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా పెద్దగా కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు…ఇక సినిమా ఇప్పుడు ఈ శుక్రవారం హిందీ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది..
హిందీ లో ఈ వీక్ లో అక్షయ్ కుమార్ నటించిన స్కై ఫోర్స్ సినిమా రిలీజ్ కానుండగా 50 రోజులను పూర్తి చేసుకున్న పుష్ప2 మూవీ ఆల్ మోస్ట్ స్లో డౌన్ అయింది. మాస్ సెంటర్స్ లో కొంత సినిమా పెర్ఫార్మ్ చేస్తుంది అన్న నమ్మకంతో సినిమాను అక్కడ ఇప్పుడు…
డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు….ఓవరాల్ గా సినిమాను అక్కడ 650 నుండి 700 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది….మాస్ సెంటర్స్ లో కొంచం వర్కౌట్ అయినా కూడా డీసెంట్ కలెక్షన్స్ ని సినిమా అందుకునే…
అవకాశం ఉంటుందని చెప్పాలి. ఓవరాల్ గా బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య ఈ సినిమాతో లాంగ్ రన్ లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇక హిందీ లో సినిమా ఏమైనా మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి ఇప్పుడు…