బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి రేసులో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మూవీ వలన స్లో డౌన్ అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఓవరాల్ గా బిజినెస్ ను రికవరీ ని చేయగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది.
ఇక మూడో వీక్ వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా స్లో డౌన్ అవ్వడం తో క్లీన్ హిట్ కొంచం కష్టమవుతూ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత సినిమా జోరు చూపిస్తుందని అందరూ ఆశగా చూస్తూ ఉన్న టైంలో సినిమాకి ఇప్పుడు మరోసారి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది ఇప్పుడు…
రీసెంట్ టైంలో పెద్ద సినిమాలకు మొదటి రోజుల్లోనే బెటర్ ప్రింట్ లు లీక్ అవుతూ ఉండగా మరో పక్క రెండు వారాల టైం కే సినిమాల మాస్టర్ ప్రింట్స్ లు లీక్ అవుతూ ఉండగా ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది ఇప్పుడు..
సినిమా మూడో వారాన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉండగా సినిమా అఫీషియల్ మాస్టర్ ప్రింట్ ఇప్పుడు ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. సినిమా అఫీషియల్ ప్రింట్ ఇదేనా అనిపించే రేంజ్ క్వాలిటీ తో ఉన్న ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అవ్వడంతో… సోషల్ మీడియా లో ఆ ప్రింట్ చక్కర్లు కొడుతుంది…
బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ ని అందుకున్నప్పటికీ క్లీన్ హిట్ కి ఒక్క అడుగు దూరంలో ఉన్న సినిమాకి ఈ వీకెండ్ కీలకం కాగా ఇప్పుడు ఆ కలెక్షన్స్ కి మరికొంత ఇబ్బంది కలిగించేలా ప్రింట్ లీక్ అవ్వడంతో ఇది కలెక్షన్స్ పరంగా మరింత ఇబ్బంది పెట్టింది అని చెప్పాలి ఇప్పుడు.