Home న్యూస్ డాకు మహారాజ్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

డాకు మహారాజ్ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా…హాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో దూసుకు పోతున్న బాలయ్య ఈ సినిమాతో మరోసారి అంచనాలను అందుకున్నాడా..వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ మరోసారి అందరినీ మెప్పించాడో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ కి వస్తే….ఒక చిన్న పాపని కాపాడే భాద్యత హీరో తీసుకుంటాడు….ఈ క్రమంలో తన భార్యతో కలిసి ఇరిగేషన్ ఇంజనీర్స్ గా మధ్య ప్రదేశ్-రాజస్థాన్ బార్డర్ లో పని చేస్తారు…అక్కడ విలన్స్ బ్యాచ్ ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటారు…వీళ్ళని హీరో ఎదిరించాడు…ఆ పాపకి హీరో కి ఉన్న లింక్ ఏంటి…తర్వాత ఏం జరిగింది లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

అఖండ ముందు వరకు బాలయ్య సినిమాల సెలెక్షన్స్ ఒకలా ఉండేది…అఖండ తర్వాత తన సినిమాల సెలక్షన్ కంప్లీట్ గా మారిపోయింది….సినిమాలో కంటెంట్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్న బాలయ్య ఒక్క వీర సింహా రెడ్డి లాంటి యావరేజ్ కంటెంట్ ఉన్న మూవీ తప్పితే….మిగిలిన 2 సినిమాల కథల పరంగా ఫుల్ మార్కులు కొట్టేస్తాడు….

Daaku Maharaaj Movie WW Pre Release Business...NO1 Record For Balayya!!

ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా విషయంలో కూడా తన సెలెక్షన్ అదుర్స్ అని చెప్పాలి. కథ పాయింట్ మరీ బలంగా ఏమి లేక పోయినా కూడా ఎక్కడ ఎలాంటి సీన్స్ పడాలి…ఎంత క్వాలిటీ గా సినిమా ఉండాలి లాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు బాలయ్య….దాని ఫలితం…కథ అంత బలంగా లేక పోయినా కూడా….

చాలా వరకు బోర్ ఫీల్ అవ్వకుండా ఎక్స్ లెంట్ క్వాలిటీ, సీన్స్ తో నిండిపోయిన డాకు మహారాజ్ చివరి అరగంట కొంచం ఫ్లాట్ గా క్లాస్ టచ్ తో మెప్పించినా మిగిలిన సినిమా మొత్తం కూడా ఒక హై ఇస్తూ సీన్ బై సీన్ ఎక్కడా డ్రాగ్ లేకుండా ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది….

మరోసారి బాలయ్య తన డైలాగ్స్, స్క్రీన్ ప్రజెన్స్ తో దుమ్ము దులిపేశాడు…ఈ సారి స్టైలిష్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు…ఇక బాలయ్యకి తోడుగా తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో మ్రోత మొగిపోయింది అని చెప్పాలి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కి నెక్స్ట్ లెవల్ రాంపెజ్ చూపించారు….

తర్వాత హీరో ఎలివేషన్ సీన్స్ అన్నీ కూడా ఓ రేంజ్ లో వచ్చేశాయి….. ఇక హీరోయిన్స్ పర్వాలేదు అనిపించగా పాప కూడా మెప్పించింది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్టార్టింగ్ కొంచం టైం తీసుకున్నా తర్వాత నుండి సెకెండ్ ఆఫ్ సగానికి పైగా టైం వరకు ఓ ఫ్లో లో అలా వెళ్ళిపోతుంది…..

సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ అని చెప్పాలి, విజువల్స్ అండ్ క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా డైరెక్టర్ బాబీ హీరోని ఎక్స్ లెంట్ గా ప్రజెంట్ చేసి దుమ్ము లేపాడు కానీ కథ ఇంకొంచం బలంగా రాసుకుని ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మరింత బెటర్ గా ప్రజెంట్ చేసి ఉంటే సినిమా మరో లెవల్ లో ఉండేది….

అయినా కూడా ఓవరాల్ గా బాలయ్య రీసెంట్ మూవీస్ లో అఖండ, భగవంత్ కేసరి సినిమాల రేంజ్ కి చేరువగా ఈ సినిమా ఉందని చెప్పొచ్చు…. మొత్తం మీద సినిమాలో బాలయ్య మాస్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ అండ్ తమన్ మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ ఎపిసోడ్ లు మేజర్ హైలెట్స్ అయితే…

కథ ఈజీగానే ప్రిడిక్ట్ చేసేలా ఉండటం, చివరి అరగంట ఫ్లాట్ గా ఉండటం అక్కడక్కడా స్క్రీన్ ప్లే కొంచం స్లో అయిన ఫీలింగ్ కలగడం లాంటివి మేజర్ డ్రా బ్యాక్స్….అయినా కూడా బాలయ్య నుండి ఫ్యాన్స్ కోరుకునే సీన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కి నచ్చే ఎలిమెంట్స్ సినిమాలో ఉండటంతో ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంది… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here