Home న్యూస్ హట్రిక్ హిట్స్ బాలయ్య డాకు మహారాజ్ నైజాం బిజినెస్….No1 రికార్డ్ ఔట్!!

హట్రిక్ హిట్స్ బాలయ్య డాకు మహారాజ్ నైజాం బిజినెస్….No1 రికార్డ్ ఔట్!!

0

అఖండ, వీర సింహా రెడ్డి మరియు భగవంత్ కేసరి లాంటి బాక్ టు బాక్ మూడు హాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుని కుమ్మేసిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా ఇప్పుడు సంక్రాంతికి మంచి అంచనాల నడుమ…

రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా, రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా బిజినెస్ పరంగా కూడా సినిమా మాస్ రచ్చ చేస్తూ అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతుంది.

లేటెస్ట్ గా సినిమా నైజాం ఏరియా లో ఫైనల్ బిజినెస్ రేటు కన్ఫాం అయ్యింది….బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ అఖండ ఇక్కడ 10.50 కోట్ల బిజినెస్ ను అందుకోగా, వీర సింహా రెడ్డి సినిమా ఇక్కడ ఏకంగా 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది.

ఇక భగవంత్ కేసరి సినిమా 14.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సంక్రాంతికి గ్రాండ్ గా వస్తున్నా డాకు మహారాజ్ సినిమా కి ఏకంగా 17.5 కోట్ల రేంజ్ లో రేటు ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.. ఇది బాలయ్య కెరీర్ లోనే నైజాం ఏరియాలో…

ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ అని చెప్పాలి ఇప్పుడు…ఒకప్పుడు నైజాం ఏరియా బాలయ్య కి వీక్ ఏరియా అనే వాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ కూడా బాలయ్య సినిమాలకు ఎక్స్ లెంట్ గా బిజినెస్ జరుగుతూ ఉండటం అలాగే కలెక్షన్స్ పరంగా కూడా…

బాలయ్య సినిమాలు ఇక్కడ బాగానే జోరు చూపిస్తూ ఉండగా హాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న డాకు మహారాజ్ మూవీ ఇక ఏ రేంజ్ లో సత్తా చాటి బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య హిట్ ట్రాక్ ను కొనసాగిస్తుందో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని నమోదు చేస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here