బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వరుస హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా నుండి ఇప్పుడు అఫీషియల్ గా…
ట్రైలర్ ను రిలీజ్ చేశారు….ట్రైలర్ లో బాలయ్య షాట్స్ కేక పుట్టిస్తూ ఉండగా పాటల పరంగా యావరేజ్ మార్కులు దక్కించుకున్న తమన్ ట్రైలర్ విషయంలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో కుమ్మేసి ఫుల్ మార్కులు కొట్టేశాడు ఇప్పుడు….సినిమా ట్రైలర్ ఔట్ అండ్ ఔట్…
మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోగా బందిపోటుగా, ఫారెస్ట్ ఆఫీసర్ గా బాలయ్య మాస్ రాంపెజ్ చూపించారు అనిపించేలా ఉంది…బాలయ్య కి మరీ పెద్దగా డైలాగ్స్ ఏమి పెట్టకపోయినా కూడా కొన్ని హీరో ఎలివేషన్ షాట్స్ లాంటివి ఎక్స్ లెంట్ గా మెప్పించాయి ట్రైలర్ లో…
ఫారెస్ట్ సంపదని చేజిచ్చుకోవాలని చూసే విలన్ బాబీ డియోల్ గ్యాంగ్ ప్రజలను హింసిస్తూ ఉంటారు, వాళ్ళని కాపాడే భాద్యత డాకు మహారాజ్ తీసుకుంటాడు…కట్ చేస్తే ప్రజెంట్ టైంలో ఫారెస్ట్ ఆఫీసర్ అయిన హీరో కి వచ్చిన సమస్యలు, వాటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో…
రూపొందిన సినిమాగా డాకు మహారాజ్ అనిపించింది. ట్రైలర్ చూపించిన షాట్స్ కన్నా కూడా సినిమాలో ఇంకా సాలిడ్ షాట్స్ ఉన్నాయని, అవన్నీ చూపించకుండా దాచినట్లు ట్రైలర్ చూస్తె అనిపించింది… బాలయ్య బందిపోటు షాట్స్, కొన్ని నైట్ ఫైట్ సీన్ షాట్స్ హైలెట్ గా అనిపించగా…
తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలో ఓ రేంజ్ లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన తర్వాత మినిమమ్ ఆకట్టుకునేలా ఉన్నా సంక్రాంతికి బాలయ్య ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.