Home న్యూస్ చిన్న సినిమా @ 350….మామూలు రచ్చ కాదిది!

చిన్న సినిమా @ 350….మామూలు రచ్చ కాదిది!

0
Darling Movie Total Overseas Theaters Count
Darling Movie Total Overseas Theaters Count

బాక్స్ ఆఫీస్ దగ్గర 3 నెలల అన్ సీజన్ కి ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) ఎండ్ కార్డ్ వేసి టాలీవుడ్ తరుపునే కాకుండా ఈ ఇయర్ ఇండియా తరుపున కూడా బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. కల్కి విజయం తర్వాత తిరిగి టాలీవుడ్ ఊపిరి పీల్చుకోగా ఇప్పుడు కల్కి వచ్చిన మూడు వారాల తర్వాత…

టాలీవుడ్ నుండి వరుస సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఈ వారంలో ఆడియన్స్ ముందుకు ప్రియదర్శి(Priyadarshi) మరియు నభా నటేష్(Nabha Natesh) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్దం అవుతున్న సినిమా డార్లింగ్(Darling Movie)….

ట్రైలర్ తో చాలా వరకు ఆకట్టుకున్న సినిమా డీసెంట్ కామెడీ ఎంటర్ టైనర్ అనిపిస్తూ ఉండగా ఆడియన్స్ కి నచ్చే అవకాశం కనిపిస్తున్న సినిమా ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. కాగా ఒక్క అమెరికాలోనే సినిమా ఇప్పుడు ఏకంగా 200 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా…

టోటల్ ఓవర్సీస్ లో సినిమా ఆల్ మోస్ట్ 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఓ చిన్న సినిమా కి ఈ రేంజ్ లో రిలీజ్ చేస్తూ ఉండటం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఈ ఇయర్ హనుమాన్(HanuMan Movie) తో అదరగొట్టిన నిర్మాతలే ఈ సినిమాను తీయగా…

ఓవరాల్ గా అన్ని చోట్లా గ్రాండ్ గా సినిమాను రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు…సినిమా మీద డీసెంట్ బజ్ అయితే ఇప్పుడు ఉండటంతో రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదు అనిపించే లెవల్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసే అవకాశం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here