బాక్స్ ఆఫీస్ తన రికార్డులను తానె బ్రేక్ చేస్తూ సంచలన వసూళ్ళతో నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ ఉండగా సినిమా 2 రోజుల్లో అంచనాలను మించి సాలిడ్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ రికవరీతో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా…
సినిమా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన దసరా సినిమాకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో జోరుని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతూ దుమ్ము లేపుతుంది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో దసరా టాప్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా హిట్3 మూవీ టాప్ లో ఉంది. ఇక రెండు రోజులు పూర్తి అయిన తర్వాత…
రెండు సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే…రెండో రోజు దసరా తెలుగు రాష్ట్రాలలో 5.86 కోట్ల షేర్ ని అందుకుంటే హిట్3 మూవీ 6.03 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా 2వ రోజున దసరా మూవీ 8.08 కోట్ల షేర్ ని 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకోగా…
హిట్3 మూవీ 9.08 కోట్ల షేర్ ని 16.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సాలిడ్ గా కుమ్మేసింది. ఇక టోటల్ గా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో దసరా మూవీ 20.08 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా… హిట్3 సినిమా 18.94 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
అదే టైంలో వరల్డ్ వైడ్ గా దసరా సినిమా 2 రోజుల్లో 29.08 కోట్ల షేర్ ని 52.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా హిట్3 మూవీ మాత్రం 30.59 కోట్ల రేంజ్ లో షేర్ ని 56.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…దాంతో వరల్డ్ వైడ్ గా దసరా మీద లీడ్ ని చూపిస్తున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఇంకొంచం జోరు పెంచాల్సిన అవసరం ఉంది…