Home న్యూస్ దసరా నైజాం బిజినెస్…నాని మాస్ రాంపేజ్!

దసరా నైజాం బిజినెస్…నాని మాస్ రాంపేజ్!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా భారీ లెవల్ లో ఈ నెల ఎండ్ టైం కి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడగా సినిమా కి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ప్రమోషన్స్ జరుగుతూ ఉండటం తో ఓపెనింగ్స్ పరంగా కూడా సినిమా నాని కెరీర్ లో అద్బుతాలను సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సినిమా కి అన్ని ఏరియాలలో కూడా బిజినెస్ ఆల్ మోస్ట్ క్లోజ్ అవ్వగా ఒక్కో ఏరియా బిజినెస్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా సినిమా ఇప్పుడు నైజాం ఏరియాకి గాను నాని కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ బిజినెస్ ను అందుకుంది సినిమా ఇప్పుడు…

మొత్తం మీద సినిమా నైజాం ఏరియాలో ఏకంగా 13.60 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన సినిమా ఇక్కడ ఓపెనింగ్స్ పరంగానే అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

ఇక సినిమా అన్ని ఏరియాల్లో కూడా సాలిడ్ బిజినెస్ ను అందుకోగా సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఫస్ట్ బిగ్ మూవీ అవ్వడంతో కచ్చితంగా ఓపెనింగ్స్ నుండే అద్బుతాలు సృష్టించడం ఖాయం, టాక్ ఏమాత్రం పాజిటివ్ గా ఉన్నా నాని కెరీర్ లో ది బెస్ట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here