నాచురల్ స్టార్ నాని కి తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ ఉంది, తన సినిమాలు అంటే అన్ని చోట్లా ఆడియన్స్ భారీ లెవల్ లోనే థియేటర్స్ కి వచ్చి సినిమాను చూస్తారు. కానీ తన లేటెస్ట్ మూవీ దసరా విషయంలో ఆంధ్ర సీడెడ్ ఆడియన్స్ ఎందుకో కొంచం అనుకున్న రేంజ్ లో ఆదరించడం లేదు. సినిమా బ్యాగ్ డ్రాప్ తెలంగాణా నేపధ్యం అవ్వడంతో భాషలో ఏమైనా ఇబ్బంది ఉందో లేక సినిమా అనుకున్న రేంజ్ లో…
ఎక్కలేదో తెలియదు కానీ ఇప్పుడు దసరా కలెక్షన్స్ మాత్రం ఆంధ్ర సీడెడ్ ఏరియాలు కలిపినా కూడా నైజాంని అందుకోలేక పోతున్నాయి… తెలంగాణ బ్యాగ్ డ్రాప్ కాబట్టి ఇక్కడ కొంచం ఎక్కువ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది అనుకున్న చాలా వరకు సినిమాల విషయంలో ఆంధ్ర కలెక్షన్స్ నైజాం కలెక్షన్స్ కి…
ఈక్వల్ గా ఉంటాయి. సీడెడ్ కలెక్షన్స్ తో కలిపి టోటల్ ఆంధ్రప్రదేశ్ కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇప్పుడు దసరా విషయానికి వస్తే నైజాంలో 4 రోజుల్లో 18.32 కోట్ల షేర్ ని అందుకుంటే ఆంధ్ర మరియు సీడెడ్ 2 కలిపి మొత్తం మీద 15.21 కోట్ల షేర్ ని మాత్రమే అందుకుంది…
అంటే ఆల్ మోస్ట్ 3 కోట్లకు పైగా లీడ్ నైజాం ఏరియా నుండి సొంతం చేసుకుంది దసరా మూవీ…రీసెంట్ గా వచ్చిన బలగం కూడా ఇలానే పెర్ఫార్మ్ చేసినా నాని దసరాకి ఇలా జరగదు అనుకున్నా ఇలానే జరిగింది. నైజాంలో బ్రేక్ ఈవెన్ ని అందుకున్న దసరా ఆంధ్ర సీడెడ్ లో బ్రేక్ ఈవెన్ కి ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.