నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా కోసం దేశం మొత్తం తిరిగి అన్ని చోట్లా సినిమాను ఎక్స్ లెంట్ గా ప్రమోట్ చేసుకున్నాడు. సౌత్ భాషల్లో కూడా సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో కష్టపడి సినిమాను ప్రమోట్ చేసినా కానీ మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో మాత్రం ఇతర భాషల్లో దసరా నిరాశ కలిగించే కలెక్షన్స్ నే సొంతం చేసుకుని మైండ్ బ్లాంక్ చేసింది ఇప్పుడు…
సినిమా కేరళలో 12 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా తమిళ్ లో మాత్రం కొంచం పర్వాలేదు అనిపిస్తూ 60 లక్షల గ్రాస్ ను అందుకుంది… ఇక టీం ఎన్నో ఆశలు పెట్టుకున్న హిందీ మార్కెట్ లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది దసరా మూవీ….
తొలిరోజు కేవలం 45 లక్షల లోపే నెట్ కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకుని నిరాశ పరిచింది. ఓవరాల్ గా ఈ మూడు చోట్లా నాని సినిమాను ఎక్స్ లెంట్ గా ప్రమోట్ చేశాడు. ముఖ్యంగా హిందీ లో ఇంకా ఎక్కువ ప్రమోట్ చేసినా అక్కడ ఓపెనింగ్స్ నిరాశ పరిచాయి ఇప్పుడు..
కానీ సినిమాకి అన్ని చోట్లా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ అయితే పాజిటివ్ గానే ఉండటంతో సినిమా ఏమైనా జోరు చూపించి గ్రోత్ ని వీకెండ్ లో సొంతం చేసుకుంటుందేమో అని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి సినిమా లాంగ్ వీకెండ్ లో ఈ చోట్ల ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.