Home న్యూస్ దసరా రివ్యూ…రేటింగ్….హిట్టు బొమ్మా!!

దసరా రివ్యూ…రేటింగ్….హిట్టు బొమ్మా!!

0

నాచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ నటించిన రా రస్టిక్ మూవీ దసరా ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయింది. సినిమా ను అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ప్రమోట్ చేసిన నాని అన్ని చోట్లా సినిమా కి బజ్ అయితే ఏర్పడేలా చేశాడు. మరి ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన దసరా మూవీ ఎంతవరకు అంచనాలను అందుకుని మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….

తెలంగాణలోని సింగరేణి గనుల్లో పని చేసే హీరో అండ్ ఫ్రెండ్ కి మరో ఫ్రెండ్ అయిన కీర్తి సురేష్ ఉంటుంది. సరదాగా సాగిపోతున్న వీరి లైఫ్ లోకి ఒక విలన్ ఎంటర్ అవుతాడు, ఆ విలన్ వలన హీరో ధరణి లైఫ్ ఎలా చేంజ్ అయింది… ఆ తర్వాత జరిగిన విశేషాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పాయింట్ పరంగా చెప్పాలి అంటే చాలా బేసిక్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన సినిమా దసరా…. సాధరణమైన స్టొరీ పాయింట్ తో వచ్చినా కానీ లీడ్ యాక్టర్స్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్…

ఆ పాత్రలను తీర్చిదిద్దిన విధానం వలన స్టొరీ కొంచం ఊహించినట్లే ఉన్నప్పటికీ ఆడియన్స్ స్క్రీన్స్ కి అతుక్కుపోయి తర్వాత ఏం అవుతుందా అని ఆసక్తిగా చూస్తారు, ఫస్టాఫ్ వరకు పాత్రల పరిచయం, ఆ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీతో సాగగా ప్రీ ఇంటర్వెల్ నుండి అసలు కథ మొదలు అయ్యి ఇంటర్వెల్ హార్డ్ హిట్టింగ్ గా సాగుతుంది, తర్వాత సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వడం కూడా అదే విధంగా స్టార్ట్ అవ్వగా….

మధ్యలో కథ స్లోగా సాగినా కానీ మల్లె క్లైమాక్స్ ఆసక్తిగా సాగుతుంది.. నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపగా హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో కూడా అదరగొట్టేశాడు, ఇక సెకెండ్ లీడ్ చేసిన శెట్టి కూడా మెప్పించాగా కొన్ని సీన్స్ బాగానే హైలెట్ అయ్యాడు. ఇక కీర్తి సురేష్ రోల్ కూడా చాలా బాగా సెట్ అవ్వగా విలన్ పర్వాలేదు, సముద్రఖని మరియు సాయి కుమార్ ల రోల్స్ జస్ట్ ఓకే అనిపిస్తాయి. ఇక సంగీతం బాగుండగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది ఇంకా కొన్ని సీన్స్ కి మరింత జోష్ చూపించే అవకాశం ఉంది కానీ సింపుల్ గా కానిచ్చారు…

ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాగా డైరెక్షన్ విషయానికి వస్తే శ్రీకాంత్ ఓడెల ఫస్ట్ మూవీనే అయినా ఎక్కడా ఇది ఫస్ట్ సినిమా డైరెక్టర్ మూవీ అనిపించేలా కాకుండా ఒక ఎక్స్ పీరియన్స్ ఉన్న డైరెక్టర్ గా మెప్పించాడు. బేసిక్ స్టొరీ పాయింట్ నే పక్కా రా రస్టిక్ నేపధ్యంలో ఊరమాస్ సీన్స్ తో నింపేశాడు.. ఆడియన్స్ ఇది ముందే గ్రహించి థియేటర్స్ కి వెళితే కొన్ని స్లో గా సాగే సీన్స్ ఉన్నప్పటికీ కథ ప్రిడిక్ట్ చేసేలా ఉన్నప్పటికీ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

మొత్తం మీద సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే, నాని ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ లెంట్ యాక్షన్ సీన్స్, మాస్ బ్యాగ్ డ్రాప్ అండ్ గుడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. ఇక మైనస్ ల విషయానికి వస్తే కథ ప్రిడిక్ట్ చేసేలా ఉండటం అలాగే నరేషన్ కొంచం నెమ్మదిగా సాగడం అని చెప్పాలి. అయినా కానీ థియేటర్స్ కి అంచనాలతో వెళ్ళే ఆడియన్స్ కి గానీ అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కానీ దసరా చాలా వరకు నచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here