బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ టాప్ స్టార్స్ మార్కెట్ రేంజ్ భారీ గా పెరిగి పోయింది కానీ మీడియం రేంజ్ హీరోల మార్కెట్ మాత్రం ఇంకా అంతలా పెరగలేదు అని చెప్పొచ్చు, లేదా మీడియం రేంజ్ హీరోలకి ఈ మధ్య మంచి సినిమాలు చాలా తక్కువగా పడుతున్నాయి అని చెప్పాలి. సీనియర్స్ అలాగే టాప్ స్టార్స్ సినిమాలకు ఓపెనింగ్స్ సెన్సేషనల్ అనిపించే విధంగా సొంతం అవుతూ ఉన్నప్పటికీ కూడా మీడియం రేంజ్ హీరోల…
సినిమాలకు ఓపెనింగ్స్ మాత్రం ఇప్పటి వరకు 10 కోట్ల మార్క్ ని తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ అందుకోలేదు, లైగర్ తో విజయ్ దేవరకొండ ఈ మార్క్ ని అందుకుంటాడు అనుకున్నా సినిమా అట్టర్ డిసాస్టర్ టాక్ ఎఫెక్ట్ కలెక్షన్స్ పై క్లియర్ గా పడి ఎఫెక్ట్ అయింది.
కానీ ఇప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా మంచి బజ్ తో ఈ నెల ఎండ్ టైం కి ఆడియన్స్ ముందుకు రాబోతున్న నాచురల్ స్టార్ నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దసరా పై ఎక్స్ లెంట్ బజ్ ఉన్న నేపధ్యంలో సినిమాకి ఉన్న బజ్ దృశ్యా…
టాక్ కూడా డీసెంట్ గా ఉంటే కచ్చితంగా మీడియం రేంజ్ హీరోల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నాని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి ఈ అడ్వాంటేజ్ ను నాని ఎంతవరకు వాడుకుని ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో ఊచకోత కోస్తాడో చూడాలి.