బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో వరుస విజయాలతో కెరీర్ బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మరోసారి మాస్ రచ్చ చేసి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు…
అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పుడు నాని కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు….రెండేళ్ళ క్రితం నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో వచ్చిన…
దసరా సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపి నాని కెరీర్ లో ఫస్ట్ 60 కోట్ల షేర్ మార్క్ మూవీగా నిలిచింది. లాంగ్ రన్ లో గ్రాస్ పరంగా 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని నాని కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా నిలిచింది.
ఇక ఇప్పుడు నాని నటించిన హిట్3 మూవీ మూడో వీకెండ్ లోనే ఈ మార్క్ ని దాటేసి నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది కానీ షేర్ పరంగా దసరా ని అందుకోవడానికి సినిమా ఇంకా కొంచం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దసరా మూవీ తెలుగు రాష్ట్రాల్లో మంచి జోరుని లాంగ్ రన్ లో చూపించగా హిట్3 మూవీ మాత్రం తెలుగు రాష్ట్రాల ఆవల ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడంతో గ్రాస్ పరంగా నాని కెరీర్ లో హైయెస్ట్ గ్రాస్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇక లాంగ్ రన్ లో దసరా షేర్ మార్క్ దాటుతుందో లేదో చూడాలి.