టాక్ బాగుంటేనే కలెక్షన్స్ భారీ గా వస్తాయి అనుకోవడం తప్పు అని ఈ మధ్య చాలా సినిమాలు నిరూపిస్తున్నాయి, ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో సినిమా ఈ కోవలోకి చేరింది, ఆ సినిమా నే హాలివుడ్ నుండి డబ్ అయిన ది లయన్ కింగ్ మూవీ. సినిమా లో విజువల్స్ ఎంత బాగున్నా కథ పరంగా కానీ కథనం పరంగా కానీ ఎలాంటి కొత్తదనం లేకుండా పాత కథనే మళ్ళీ తీశారని ఒక బ్యాడ్ టాక్ ఉండగా…
సినిమా చాలా స్లో గా ఉందని కేవలం చిన్నపిల్లలకి మాత్రమె అంటూ టాక్ ఓవరాల్ గా బయట వీక్ గానే ఉంది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అవేవి కలెక్షన్స్ రూపంలో ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోతున్నాయి. ది లయన్ కింగ్ తొలి రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని ఇండియా లో అందుకుంది.
అన్ని డబ్ వర్షన్స్ తో కలిపి ఫస్ట్ డే 11 కోట్లు రెండో రోజు 19 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా 2 రోజుల్లో 30 కోట్లు రాబట్టగా సినిమా ఇండియా లో బ్రేక్ ఈవెన్ కి 80 కోట్లు వసూల్ చేస్తే సరిపోతుందట. ఈ లెక్కన మొదటి వారంలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయమని అంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.