అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ డే కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్

0
398

  మాస్ మహారాజ్ రవితేజ శ్రీనువైట్ల ల రీసెంట్ మూవీస్ అన్నీ బాక్స్ ఆఫీస్ బోల్తా కొట్టడంతో వీళ్ళ కొత్త సినిమా అమర్ అక్బర్ ఆంటోని సినిమా పై అంచనాలు భారీ గా తగ్గాయి. రవితేజ సినిమాలంటే ఆన్ లైన్ టికెట్ సేల్స్ తో పాటు ఆఫ్ లైన్ లో టికెట్ సేల్స్ కూడా జోరుగా ఉంటాయి. కానీ ఈ సారి షాకింగ్ గా ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ రెండు కూడా చాలా చప్పగా కొనసాగుతుండటం అందరికీ కొంత షాక్ ని కలిగిస్తుంది.

ఇక సినిమా మొదటి రోజు మొదటి రెండు షోల కి సుమారు 30% కి పైగా బుకింగ్స్ ని సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి కొంత గ్రోత్ ని సాధించి 35% లోపు బుకింగ్స్ ని సాధించింది. దాంతో మొదటి రోజు సినిమా అండర్ పెర్ఫార్మ్ చేసినట్లు అయింది.

నైట్ షోలలో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ భారీ గా పెరిగితే తప్పితే మొదటి రోజు అమర్ అక్బర్ ఆంటోని సినిమా కలెక్షన్స్ 3.5 నుండి 4 కోట్ల రేంజ్ లోనే రావడం దాదాపు ఖాయం అయింది. మరి ఏమైనా అద్బుతమ్ జరుగుతుందా లేక ఇదే ఫైనల్ అవుతాయో అఫీషియల్ కలెక్షన్స్ వచ్చే వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!