Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ డే 1 కలెక్షన్స్…ఇదేమి మాస్ రా బాబు!!

ఇస్మార్ట్ శంకర్ డే 1 కలెక్షన్స్…ఇదేమి మాస్ రా బాబు!!

1748
0

     టాలీవుడ్ లో మంచి మాస్ మూవీ వచ్చి చాలా కాలమే అయింది, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో అదిరి పోయే మ్యూజిక్ తో హీరోల సినిమాలు ఒక్కటి కూడా ఈ మధ్య రాలేదు, ఆ లోటు ని బర్తీ చేస్తూ వచ్చిన రామ్ “ఇస్మార్ట్ శంకర్” బాక్స్ ఆఫీస్ ను మొదటి రోజు ఓ రేంజ్ లో ఏలింది. ఎంతలా అంటే అనుకున్న అంచనాలను కూడా ఓ రేంజ్ లో మించి పోయే లెవల్ లో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది.

మొదటి రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల ఆక్యుపెన్సీ ఓవరాల్ గా 80 టు 85% వరకు ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి వచ్చే సరికి అది 90% ని చేరింది, కేవలం టాప్ స్టార్ హీరోల కి మాత్రమె సాధ్యం అయ్యే రేంజ్ ఆక్యుపెన్సీ ఇది.

రామ్ కెరీర్ లో ఈ రేంజ్ లో దుమ్ము లేపిన సినిమా మరోటి లేదు. చాలా ఏరియాల్లో ఎక్స్ ట్రా థియేటర్స్ ని మార్నింగ్ షో నుండే యాడ్ చేస్తూ వెళ్ళారు. అవి కూడా ఫుల్స్ అవుతూ మాస్ సినిమాల కోసం జనాలు ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పకనే చెప్పేలా ఓపెనింగ్స్ ని సాధించింది ఇస్మార్ట్ శంకర్ సినిమా.

అన్ని ఏరియాల్లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు అవాలీలగా 6 కోట్లకు పైగా షేర్ ని సినిమా అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది, అంతకు మించి కూడా కలెక్ట్ చేసే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 18.8 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది, అన్నీ అనుకున్నట్లు జరిగి వీకెండ్ మొత్తం ఇదే రేంజ్  బ్యాటింగ్ కొనసాగితే బ్రేక్ ఈవెన్ వీకెండ్ కే అయ్యే అవకాశం కూడా ఉంది, మరి మొదటి రోజు అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here