టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజుల్లో టోటల్ గా రెండు రాష్ట్రాలలో 72.58 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 97.33 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా గ్రాస్ 162 కోట్ల మార్క్ ని అందుకోగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో మండే టెస్ట్ కి సిధ్దం అయింది. ఈ సారి టెస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల వేట గురించి అని చెప్పాలి.
కాగా మండే అవ్వడం వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డ్రాప్స్ ని భారీ గానే సొంతం చేసుకుంది. మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి ఓవరాల్ గా ఆక్యుపెన్సీ కేవలం 10% లోపే ఉందని చెప్పొచ్చు. ఇక ఈవినింగ్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మెల్లిగా కొంచం గ్రోత్ ని సాధించాయి.
దాంతో సినిమా మొత్తం మీద 19 వ రోజు ముగిసే సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర 22 లక్షల నుండి 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. కానీ మినిమమ్ 40 లక్షలకు పైగా షేర్ అందుకుంటే 100 కోట్ల మార్క్ త్వరగా అందుకునే ఛాన్స్ ఉండేది.
ఇక రామ్ నటించిన హెలొ గురు ప్రేమ కోసమే 11 రోజుల్లో 20.2 కోట్ల షేర్ ని అందుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజున భారీ గానే డ్రాప్స్ ని సొంతం చేసుకున్నా ఓవరాల్ గా ఈ రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇక విశాల్ నటించిన పందెం కోడి 2 బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా స్లో అవ్వగా ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 నుండి 10 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.