బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ ని ఓ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పూర్తీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన బింబిసార మరియు సీతా రామం సినిమాలు ఈ రోజు ఎలా పెర్ఫార్మ్ చేస్తాయి అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాల ఇబ్బంది ఉన్నప్పటికీ ఈ రెండు సినిమాలు హోల్డ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పాలి.
బింబిసార బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజుతో పోల్చితే నాలుగో రోజు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో డ్రాప్ అయింది, కానీ తిరిగి సినిమా ఈవినింగ్ షోల నుండి పుంజుకునే అవకాశం ఉండగా మొత్తం మీద…
ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.8 కోట్ల నుండి 2 కోట్ల లోపు కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక సీతారామం సినిమా ఆల్ మోస్ట్ 50% రేంజ్ లో డ్రాప్ అయినా ఇక్కడ విశేషం ఏంటి అంటే ఆల్ మోస్ట్ మొదటి రోజు లెవల్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో హోల్డ్ చేస్తూ ఉండటంతో…
ఈ రోజు సినిమా తెలుగు రాష్ట్రాలలో 1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఈ 2 సినిమాలు బాగా హోల్డ్ చేశాయి అని చెప్పడానికి బింబిసార 2 కోట్ల నుండి 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక సీతారామం 1.2 కోట్ల నుండి 1.4 కోట్ల దాకా కలెక్షన్స్ ని అందుకుంటే వర్కింగ్ డే లో మంచి హోల్డ్ ని సొంతం చేసుకున్నాయి అని చెప్పొచ్చు…
కానీ వర్షాల వలన ఇబ్బందులు ఉండటంతో మొత్తం మీద బింబిసార 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించినా సీతారామం 1.2 కోట్ల రేంజ్ లో వసూళ్లు అందుకున్నా మంచి హోల్డ్ అనే చెప్పాలి. మరి డే ఎండ్ అయ్యే టైం కి ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తాయో చూడాలి.