బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ తర్వాత నాలుగో రోజు ఫుల్ వర్కింగ్ డే అవ్వడంతో భీమ్లా నాయక్ డ్రాప్స్ ని ఎక్కువగా సొంతం చేసుకుంది, అనుకున్న దానికన్నా కూడా కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను 4 వ రోజు సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు ఆ డ్రాప్స్ ని 5 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కవర్ చేయబోతుంది అని చెప్పాలి. మహా శివరాత్రి హాలిడే అడ్వాంటేజ్ కలిసి రావడం తో….
భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, మార్నింగ్ షోలు కొంచం స్లో గా స్టార్ట్ అయినా కానీ మ్యాట్నీ షోల నుండి సినిమా రాంపేజ్ మొదలు అయింది, ఆంధ్రలో 4 వ రోజు కన్నా కూడా బెటర్ గా హోల్డ్ చేసిన సినిమా…
నైజాంలో కూడా ఆల్ మోస్ట్ 4 వ రోజు లెవల్ లో బుకింగ్స్ అండ్ ఆక్యుపెన్సీ రిపోర్ట్ అయ్యాయి. మాములుగా అయితే 4 వ రోజు వర్కింగ్ డే నుండి 5 వ రోజు చాలా వరకు సినిమాలు 25% టు 30% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంటాయి, కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ కి….
మహా శివరాత్రి హాలిడే కలిసి రావడంతో ఆ డ్రాప్స్ అన్నీ కవర్ అయ్యి ఆల్ మోస్ట్ 4 వ రోజు లెవల్ లో కొన్ని చోట్లా 4 వ రోజు కి మంచి హోల్డ్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు సినిమా 5 వ రోజు కి వచ్చే సరికి 6 కోట్ల రేంజ్ నుండి 6.3 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది…
శివరాత్రి సందర్బంగా నైట్ షోలు కూడా ప్లాన్ చేశారు కాబట్టి 6.5 రేంజ్ కి వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఉంది….. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 7 కోట్ల నుండి 7.5 కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. మరి 5 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్క ఈ అంచనాలను తగ్గట్లే వస్తాయా లేక అంచనాలను మించి పోతాయో చూడాలి ఇక…