Home న్యూస్ డే-13 హిట్3….డే 5 సింగిల్….బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

డే-13 హిట్3….డే 5 సింగిల్….బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన  శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన కొత్త సినిమా సింగిల్(Single Movie) మూవీలు రెండూ కూడా ఆడియన్స్ ను థియేటర్స్ కి బాగానే రప్పిస్తూ కలెక్షన్స్ ని సాధిస్తూ ఉండగా…

రెండు సినిమాలు ఇప్పుడు వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టగా….రెండూ కూడా వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ నే చూపెడుతూ ఉండగా…హిట్3 మూవీ 12వ రోజుతో పోల్చితే 13వ రోజున మరోసారి పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా..

ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా మరోసారి సిమిలర్ ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కొంచం డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా సినిమా 13వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…

Nani Hit3 Movie 8 Days Total WW Collections!!

వరల్డ్ వైడ్ గా సినిమా 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. ఇక సింగిల్ మూవీ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా 4వ రోజుతో పోల్చితే 5వ రోజున లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా…

ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా 70-75 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

90 లక్షల రేంజ్ నుండి మరోసారి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి… ఓవరాల్ గా రెండు సినిమాలు వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించే విధంగా రెవెన్యూని జనరేట్ చేస్తున్నాయి. ఇక రెండు సినిమాల ఈ రోజు అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Sree Vishnu Single Movie 3 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here