బాక్స్ ఆఫీస్ దగ్గర మే నెలలో మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా శ్రీ విష్ణు(Sree Vishnu) నటించిన సింగిల్(Single Movie) మూవీస్ వీకెండ్ లో మంచి జోరుని చూపెట్టి ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ…
హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండగా రెండు వారాలను పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగు పెట్టిన హిట్3 ఒవీ ఈ వీక్ లో కూడా డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఉన్నంతలో సినిమా మరోసారి మంచి ట్రెండ్ ను చూపెడుతూ 14వ రోజుతో పోల్చితే…
లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకోగా ఉన్నంతలో సినిమా మరోసారి 25-30 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. ఇక వరల్డ్ వైడ్ గా కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 40 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే…అవకాశం ఉందని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సింగిల్ మూవీ ఆల్ మోస్ట్ డే 7కి సిమిలర్ ట్రెండ్ నే చూపెడుతూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఓవరాల్ గా సినిమా 55-60 లక్షల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా..ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు…
బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 70 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. మొత్తం మీద రెండు సినిమాలు ఈ రోజు పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండగా రెండు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.