ఒక సినిమా కి ఎలాంటి క్రేజ్ ఉంది అన్నది ఆ సినిమా కి సోషల్ మీడియాలో ఉన్న హైప్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఉన్న జోరుని చూసి ఈ సినిమా కచ్చితంగా అంచనాలను మించిపోవడం ఖాయమని అనుకున్న సినిమాలు చాలా తక్కువ సమయాల్లోనే అంచనాలను తప్పుతూ ఉంటాయి, అలాంటి సినిమాల కోవలోకి ఇప్పుడు విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ లైగర్ కూడా చేరుతుంది అని చెప్పాలి. సినిమా రిలీజ్ కి మొత్తం మీద…
4 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగా ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ రోజుకి ముందు డే ఎండ్ అయ్యే టైం కి ఓవరాల్ గా హైదరాబాదులో 3.5 కోట్ల గ్రాస్ ను నైజాంలో 6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను…
టోటల్ గా తెలుగు రాష్ట్రాలలో 8.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అడ్వాన్స్ టికెట్ సేల్స్ ద్వారా సొంతం చేసుకుంది. నార్మల్ గా ఇలాంటి అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్న సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఫస్ట్ డే అవలీలగా 13-14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటాయి… స్పాట్ బుకింగ్స్, ఆఫ్ లైన్ బుకింగ్స్…
ఇలా అన్నీ కలిపి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంటుంది, కానీ లైగర్ సినిమాకి కంప్లీట్ గా నెగటివ్ టాక్ ఆడియన్స్ నుండి రావడంతో సినిమా మొదటి రోజు అఫీషియల్ గా తెలుగు రాష్ట్రాలలో 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను హైర్స్ తో కలిపి 15.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది… అంటే సినిమా మొత్తం మీద…
మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పక్కకు పెడితే ఫస్ట్ డే మరో 6.5 కోట్ల గ్రాస్ ను మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది… టాక్ పాజిటివ్ గా ఉంటె రికార్డులు క్రియేట్ చేసే సినిమా కంప్లీట్ నెగటివ్ టాక్ వలన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మైండ్ బ్లాంక్ చేసే ఓపెనింగ్స్ ను అందుకుని నిరాశ పరిచింది.