Home న్యూస్ 4650 కోట్ల సినిమా….5వ రోజే ఒరిజినల్ ప్రింట్ ఔట్…భారీ ఎదురుదెబ్బ!

4650 కోట్ల సినిమా….5వ రోజే ఒరిజినల్ ప్రింట్ ఔట్…భారీ ఎదురుదెబ్బ!

0
Deadpool & Wovlerine Movie Leaked online in just 5 Days
Deadpool & Wovlerine Movie Leaked online in just 5 Days

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఏడాది హాలీవుడ్ నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన డెడ్ పూల్ అండ్ వుల్వరిన్(Deadpool & Wovlerine 3 Days Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది.

ఇండియాలో సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఉండగా 5 రోజుల్లోనే ఏకంగా 80 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా మరో పక్క సినిమా వరల్డ్ వైడ్ గా కూడా ఊహకందని రేంజ్ లో…

కలెక్షన్స్ భీభత్సం సృష్టిస్తూ 560 మిలియన్ డాలర్స్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని 1 బిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా ఇండియన్ కరెన్సీలో సినిమా ఆల్ రెడీ 4650 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో మాస్ ఊచకోత కోసింది కేవలం 5 రోజుల టైంకే…

కానీ సినిమాకి ఎవ్వరూ ఊహించని విధంగా 5వ రోజు ఇప్పుడు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సినిమా ఒరిజినల్ మాస్టర్ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయిపొయింది….ఆ లీక్ అయిన ప్రింట్ కి అన్ని భాషల డబ్బింగ్ వర్షన్ లు యాడ్ చేసి పైరేటెడ్ సైట్స్ లో అప్లోడ్ చేసేశారు కూడా…

దాంతో రిలీజ్ అయిన 5వ రోజునే ఆన్ లైన్ లో ఒరిజినల్ ప్రింట్ లీక్ అయిన డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కి ఇది సాలిడ్ ఎదురుదెబ్బగా నిలుస్తుంది అని చెప్పాలి ఇప్పుడు. లాంగ్ రన్ లో 1.5 బిలియన్ డాలర్స్ ను అందుకునే…

కెపాసిటీ ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్న డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీ కి 5వ రోజే ఒరిజినల్ ప్రింట్ లీక్ అవ్వడంతో కలెక్షన్స్ పరంగా ఇప్పుడు సాలిడ్ గా ఎదురుదెబ్బ పడే అవకాశం ఎంతైనా ఉంది… మరి లీక్ వలన సినిమా కలెక్షన్స్ కి ఎంతవరకు గండి పడుతుందో చూడాలి ఇప్పుడు.

Deadpool & Wolverine 1st Day India Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here