Home న్యూస్ ప్రకంపనలు సృష్టించిన డెడ్ పూల్ వుల్వరిన్….డే 1 మాస్ ఊచకోత ఖాయం!

ప్రకంపనలు సృష్టించిన డెడ్ పూల్ వుల్వరిన్….డే 1 మాస్ ఊచకోత ఖాయం!

0
Deadpool & Wovlerine Indian Advance Bookings And Day 1 Collections Expectations
Deadpool & Wovlerine Indian Advance Bookings And Day 1 Collections Expectations

బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న మూవీ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్(Deadpool & Wovlerine Record Bookings in India) సినిమా మీద అంచనాలు భారీ లెవల్ లో ఉండగా ఆల్ రెడీ రిలీజ్ అయిన ట్రైలర్ లు సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేశాయి అని చెప్పాలి…

వరల్డ్ వైడ్ గానే కాకుండా ఇండియాలో కూడా సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా ఆల్ మోస్ట్ ఇండియన్ బిగ్ రిలీజ్ లకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో సినిమా మీద బజ్ అయితే ఉందని చెప్పాలి. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఇండియాలో స్టార్ట్ చేయగా…

ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా ఆల్ మోస్ట్ ఇండియాలో ఇప్పటి వరకు 3 లక్షలకి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇంకా రిలీజ్ కాకుండానే ఈ రేంజ్ లో బుకింగ్స్ తో జోరు చూపిస్తున్న డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీ…

ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత టాక్ ఏమాత్రం బాగున్నా కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా మొదటి రోజు ఇండియాలో అవలీలగా 18-20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని…

అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు… సినిమాకి టాక్ ఏమాత్రం బాగున్నా ఈ అంచనాలను కూడా మించిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఈ ఏడాది హాలీవుడ్ మూవీస్ పరంగా ఇండియాలో ఈ సినిమా బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here