డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ రాక తో టెలివిజన్ లో సినిమాలు చూసే వారి సంఖ్య రాను రాను తగ్గిపోతుంది, ఛానల్ వాళ్ళు కూడా సినిమాలను భారీ రేటు కి కొంటున్న సరైన సమయం లో టెలికాస్ట్ చేయక పోవడం లాంటివి తర్వాత ఆ సినిమాలకు వచ్చే TRP రేటింగ్ ల విషయం లో తీవ్ర నిరాశ ని కలిగిస్తున్నాయి. రీసెంట్ టైం లో ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిన వినయ విదేయ రామ..
చాలా ఆలస్యంగా టెలికాస్ట్ అవ్వడం తో TRP రేటింగ్ ఘోరంగా వచ్చింది, అప్పటికే సినిమా మాస్టర్ ప్రింట్ ప్రైం లో ఉండటం తో బుల్లి తెరపై ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు అదే పరిస్థితి విజయ్ దేవరకొండ రష్మిక ల క్రేజీ కాంబో లో గీత గోవిందం తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ పై పడింది.
ఈ సినిమా జులై లో రిలీజ్ అవ్వగా మాస్టర్ ప్రింట్ నెలన్నర లోపే వచ్చేసింది, అయినా కానీ సినిమా ని కొన్న జెమినీ చానెల్ మాత్రం ఆలస్యంగా దీపావళి టైం లో సినిమాను టెలికాస్ట్ చేశారు. ఫలితం ఆ సినిమా కి కేవలం 5.47 TRP రేటింగ్ మాత్రమె దక్కింది, సర్ప్రైజ్ గా….
రెండేళ్ళ క్రితం రిలీజ్ అయిన ధనుష్ వి.ఐ.పి 2 మూవీ మాస్టర్ ప్రింట్ అస్సలు రిలీజ్ కాక పోవడం రీసెంట్ గా అది రిలీజ్ అయినా స్టార్ మా లో టెలికాస్ట్ చేయడం తో ఆ సినిమా కి 6 TRP రేటింగ్ దక్కింది. దాంతో డైరెక్ట్ తెలుగు క్రేజీ మూవీ కన్నా డబ్బింగ్ మూవీ కి ఎక్కువ TRP రేటింగ్ దక్కినట్లు అయింది.
2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినవే అయినా స్ట్రీమింగ్ యాప్స్ లో ముందే ప్రింట్స్ వస్తుండటం తో క్రేజీ మూవీస్ కి కూడా అనుకున్న TRP రేటింగ్ దక్కడం లేదు. విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబో లో వచ్చిన గీత గోవిందం రికార్డ్ బ్రేకింగ్ TRP రేటింగ్ సొంతం చేసుకుంటే తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ డబ్బింగ్ మూవీ తో పోటి లో కూడా గెలవలేక పోయింది.