Home న్యూస్ డిసాస్టర్ మూవీ…ఈ రికార్డ్ ఏంటి సామి!!

డిసాస్టర్ మూవీ…ఈ రికార్డ్ ఏంటి సామి!!

1592
0

కొన్ని కొన్ని సార్లు సినిమా లు ఇక్కడ ఫ్లాఫ్ అయినా వేరే చోట హిట్స్ అవుతుంటాయి, రీమేక్ ల రూపంలో కావచ్చు లేదా హిందీ లో డబ్ అయ్యి యూట్యూబ్ లో సంచలన వ్యూస్ తో దుమ్ము లేపడం కావచ్చు ఆ సినిమా లకు మంచి క్రేజ్ దక్కుతుంది, లేటెస్ట్ గా తెలుగు లో మంచి హైప్ నడుమ రిలీజ్ అయిన యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా…

ఇక్కడ రిలీజ్ అయిన మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ని తెచ్చుకోగా భారీ బిజినెస్ ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా మిగిలిన విషయం తెలిసిందే, అలాంటి సినిమా ఇప్పుడు టాలీవుడ్ తరుపున హిందీ లో డబ్ అయిన మూవీస్ లో…

సరికొత్త రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది. హిందీ లో డబ్ అయిన అన్ని సినిమాల లోకి హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న సినిమా గా డియర్ కామ్రేడ్ మూవీ సంచలన రికార్డ్ నమోదు చేసింది, ఏకంగా 1.6 మిలియన్స్ కి పైగా లైక్స్ ని సాధించింది ఈ సినిమా.

వ్యూస్ పరంగా 130 మిలియన్స్ కి పైగానే వ్యూస్ వచ్చినా లైక్స్ మాత్రం అల్టిమేట్ లెవల్ లో సొంతం చేసుకుని దుమ్ము లేపి ఇతర సినిమాల రికార్డులు అన్నీ బ్రేక్ చేసింది. రెండో ప్లేస్ లో జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ మూవీ 1.3 మిలియన్స్ లైక్స్ తో ఉంది. ఒకసారి అక్కడ హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న టాలీవుడ్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే…

👉#DearComrade-1.6M
👉#JayaJanakiNayaka-1.3M
👉#HelloGuruPremaKosame-1.3M
👉#IsmartShankar-1.2M
👉#VunnadiOkateZindagi-1.1M
👉#Sarrainodu-1M
👉#AAa-1M
👉#Kavacham-1M
👉#DJ-944K
👉#SrinivasaKalyanam-921K
ఇవీ మొత్తం మీద అక్కడ హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న టాలీవుడ్ మూవీస్, ఎవ్వరి ఊహలకు అందని విధంగా అక్కడ 250 మిలియన్స్ కి పైగా వ్యూస్ ఉన్న అల్లు అర్జున్ మూవీస్ కన్నా కూడా భారీ లైక్స్ ని అందుకుని డియర్ కామ్రేడ్ నెలకొల్పిన లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేసే సినిమా ఏది అవుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here