Home న్యూస్ డియర్ మేఘా రివ్యూ…హిట్టా-ఫట్టా!

డియర్ మేఘా రివ్యూ…హిట్టా-ఫట్టా!

0

ఒక చోట ఇష్ట పడిన సినిమా మరో చోట ఇష్టపడాలని రూల్ ఏమి లేదు… కానీ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ని అనుకుని సినిమా తీసి అది ఆడియన్స్ కి నచ్చకపోతే అదే కాన్సెప్ట్ ను మరోలా తీసి మరో చోట హిట్ అయితే మళ్ళీ ఆ సినిమాను ఇక్కడ రీమేక్ చేయడం అన్నది సాహసం అనే చెప్పాలి… ఇదంతా ఆడియన్స్ ముందుకు వచ్చిన డియర్ మేఘా సినిమా గురించి.. ఈ సినిమా కాన్సెప్ట్ తెలుగు లో…

ఇది వరకే వచ్చిన అందాల రాక్షసి ని పోలి ఉంటుంది, ఇక్కడ ఆ సినిమా ఆడలేదు కానీ ఇదే కాన్సెప్ట్ ను కొంచం ట్రీట్ మెంట్ మార్చి కన్నడలో దియా పేరుతో తీయగా అక్కడ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. దాంతో ఈ సినిమాను తెలుగు లో డియర్ మేఘా గా రీమేక్ చేశారు.

మేఘా ఆకాష్ లీడ్ రోల్ నటించిన ఈ సినిమా ఓ ట్రయాంగిల్ లవ్ స్టొరీ…. హీరోయిన్ ఫస్ట్ హీరోని వన్ సైడ్ లవ్ చేయగా తర్వాత హీరో దూరం అయ్యి 3 ఏళ్ల తర్వాత ప్రత్యక్షం అయ్యి నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటూ హీరోయిన్ కి చెబుతాడు…. దాంతో వీరి లవ్ స్టొరీ మొదలు అవ్వగా…

ఒక ఊహించని షాకింగ్ ఇంసిడెంట్ జరుగుతుంది… తర్వాత హీరోయిన్ లైఫ్ లో మరో హీరో ఎంటర్ అవుతాడు… మళ్ళీ కొంతకాలం తర్వాత వీళ్ళ లవ్ స్టొరీ మొదలు అవ్వగా మళ్ళీ ఊహించని ట్విస్ట్ లు వస్తూ ఉంటాయి. మరి తర్వాత ఏమయింది, ఆ ట్విస్ట్ లు ఏంటి లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఇలాంటి కాన్సెప్ట్ లు మన వాళ్ళకి నచ్చినవి…

చాలా తక్కువే అని చెప్పాలి… క్లైమాక్స్ ఎండ్ అయిన విధానం కన్నడలో బాగా రిసీవ్ చేసుకున్నారు కానీ మన దగ్గర అలాంటి ఎండింగ్ లు ఉన్న చాలా సినిమాల రిజల్ట్ లు దెబ్బ కొట్టాయి. రీమేక్ అయినా హీరోయిన్ అండ్ హీరోలు ఇద్దరూ బాగా నటించి మెప్పించారు… కానీ కథ కథనం ఒరిజినల్ మాదిరిగానే చాలా స్లోగా సాగుతుంది…

ఈ సినిమా రెగ్యులర్ మూవీ లవర్స్ కోసం అయితే కాదు, స్లో లవ్ స్టొరీలను ఇష్టపడే వారు, భార‌మైన ఎండింగ్ లను మెచ్చేవాళ్ళని ఈ సినిమా ఇంప్రెస్ చేస్తుంది. ఒరిజినల్ చూసిన వాళ్ళు అతి కష్టం మీద సినిమాను చూడొచ్చు. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా నెమ్మదిగా సాగే సినిమాలను ఇష్టపడితే పర్వాలేదు అనిపిస్తుంది. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here