ఇదే ఫైనల్…5 మూవీస్ ఫైనల్ టాక్ ఇదే

0
635

      ఈ వీకెండ్ ఫైనల్ గా 5 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా వేటి కవే డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించాయి. ఉన్నంతలో ఈ సినిమాలలో ప్రేక్షకులను అలరించిన సినిమాల రోజు ముగిసే సమయానికి ఫైనల్ టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండి. ముందుగా అంతరిక్షం మూవీ క్లాస్ అండ్ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడేవారికి నచ్చగా మిగిలిన సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కొంచం దూరంగానే ఉన్నారు. ఫైనల్ గా సినిమాకి ఎబో యావరేజ్ టాక్ లభించింది.

ఇక పడిపడిలేచే మనసు పై అంచనాలు భారీ గానే ఉన్నా సినిమా మొదటి అర్ధభాగం ఆకట్టుకున్నా ఫైనల్ గా సినిమా మాత్రం ఆకట్టుకోలేదు…కానీ ఫస్టాఫ్ బాగుండటంతో సినిమా ఫైనల్ టాక్ యావరేజ్ గా తేల్చేశారు టోటల్ ఆడియన్స్ అందరు.

ఇక కన్నడ మూవీ KGF అన్ని చోట్లా రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాలలో సినిమాకి మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ దక్కుతుంది, యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారికి సినిమా ఒక విందు భోజనమే చెప్పాలి. కానీ లెంత్ ఎక్కువ అవ్వడం రొటీన్ ఫార్మాట్ లోనే ఉండటం తో…

ఫైనల్ గా సినిమా ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ లభించింది. ఇక కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ జీరో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా ఓపెన్ అవ్వగా మొదటి అర్ధభాగానికి మంచి టాక్ లభించినా సెకెండ్ ఆఫ్ అంచనాలు అందుకోలేదు.

దాంతో ఫైనల్ గా సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ కన్ఫాం అయింది. ఇక ధనుష్ మారి 2 తెలుగు లో కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వారి మెప్పు పొందుతుండటం తో సినిమా కి ఫైనల్ గా ఎబో యావరేజ్ టు హిట్ టాక్ లభించింది అని చెప్పాలి.

ఇవి మొత్తం మీద ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల ఫైనల్ బాక్స్ ఆఫీస్ టాక్ లు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల పెర్ఫార్మెన్స్ ని బట్టి వీకెండ్ విన్నర్ గా నిలిచే సినిమా ఎదో అంచనా వేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here