Home న్యూస్ డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే!

డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే!

1252
0

బాక్స్ ఆఫీస్ దగ్గర నవంబర్ నెలలో చాలా చప్పగా సాగుతుంది, అంచనాలు పెట్టుకున్న సినిమాలు అన్నీ కూడా ఏమాత్రం అంచనాలను అందే కలెక్షన్స్ ని అయితే సొంతం చేసుకోవడం లేదు, ఇంకా మంత్ ఎండ్ అవ్వలేదు కానీ ఈ నెలలో రిలీజ్ అయ్యే మిగిలిన సినిమాలు కూడా చాలా వరకు చిన్న సినిమాలే అవ్వడం తో ఆడియన్స్ పెద్ద సినిమాల కోసం వచ్చే నెల వరకు ఎదురు చూపులు చూడాల్సిందే అని చెప్పాలి.

వచ్చే నెలలో క్రేజీ మూవీస్ నాలుగు బాక్స్ ఆఫీస్ బరిలో నిలవబోతున్నాయి, బాలయ్య అఖండ సినిమా 2 న రిలీజ్ కాబోతుండగా డిసెంబర్ 17 న అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప పార్ట్ 1 రిలీజ్ కానుంది, ఇక డిసెంబర్ 24 న నాని నటించిన పాన్ ఇండియా మూవీ శ్యామ్ సింగ రాయ్ అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న గని…

సినిమాలు పోటి పడబోతున్నాయి. ఇవి నాలుగు డిసెంబర్ క్రేజీ మూవీస్ కాగా ఇక డిసెంబర్ 4 న సత్యదేవ్ స్కై లాబ్ సినిమా, డిసెంబర్ 10న కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక హాలివుడ్ డబ్ మూవీ స్పైడర్ మాన్ 17న, హిందీ మూవీస్ 83 మూవీ 24న, జెర్సీ 31 న రిలీజ్ కాబోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here